Arranged Marriages Check List: పెద్దలు కుదిర్చిన వివాహాలు..ఈ డాక్టర్ సూచనలతో నెట్టింట కలకలం
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:00 PM
అరేంజ్డ్ మ్యారేజస్ విషయంలో ఓ డాక్టర్ చేసిన సూచన పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం వివాహాలకు సంబంధించి నెలకొన్న పరిస్థితులపై అనేక మంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో అరేంజ్డ్ మ్యారేజస్ అంటేనే జనాలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. పెళ్లి చూపుల్లో వధూవరులు ఎదుర్కునే శల్య పరీక్షలకు అంతే లేకుండా పోతోందని బాధపడేవారు కోకొల్లలు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ చర్చకు బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఇచ్చిన ట్విస్ట్ మరింత వైరల్‌గా మారింది.
పెళ్లి చూపుల సందర్భంగా తన బంధువును వధువు తరపు వారు శాలరీ స్లిప్ అడిగారంటూ ఓ నెటిజన్ నెట్టింట పోస్టు పెట్టారు. పెద్దలు కుదిర్చే వివాహాల్లో వింత పోకడలు పొడచూపుతున్నాయని సదరు నెటిజన్ కామెంట్ చేశారు. మీకూ ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా అని జనాలను ప్రశ్నించారు. ఈ పోస్టును బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ నెట్టింట పంచుకున్నారు. చర్చకు తనదైన ట్విస్ట్ ఇచ్చారు.
‘‘శాలరీ స్లిప్ సరే.. వరుడి మెడికల్ హిస్టరీ , ఫ్యామిలీ చరిత్ర, జన్యు పరీక్షలు, సాధారణ బ్లడ్ టెస్టులు, మెడికల్ చెకప్‌లు, హెచ్‌ఐవీ టెస్టులు వంటివాటి మాటేమిటీ.. ఈ జాబితాకు క్రెడిట్ స్కోరు, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను కుడా జత చేయాలి’’ అని అన్నారు.
ఈ పోస్టుకు నెట్టింట ఊహించని విధంగా స్పందన వచ్చింది. జనాలు తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కొందరికి డాక్టర్ సూచన నచ్చింది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఇలా చేయాలని అన్నారు. మరికొందరు మాత్రం అరేంజ్డ్ మ్యారేజీల్లో వధువరులకు ఉన్న అసాధారణ ఆశలు, ఆశయాలు గురించి ప్రస్తావించారు. ఆధునిక వివాహాలపై ఇది పెద్ద భారం మోపుతోందని అన్నారు. జీతనాతాలకు తోడు సవివరమైన మెడికల్ రికార్డులు, ఆర్థిక రికార్డులను కోరడం యువతపై మరింత ఒత్తిడి పెంచడం ఖాయమని అన్నారు.
కొందరేమో ఈ చర్చపై సెటైర్లు కూడా పేల్చారు. ఈ జాబితాలోని అంశాలకు బ్రౌజర్ హిస్టరీ, సోషల్ మీడియా అకౌంట్లు చేరిస్తే కూడా బాగుంటుందని సెటైర్లు పేల్చారు.
ఇవి కూడా చదవండి:
గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన ఆవేదన.. ఈ రాజీనామా లేఖ చూస్తే..
అంతరిక్ష యాత్రలకు ఖర్చు ఎంత.. ఉచితంగా కూడా వెళ్లి రావొచ్చని తెలుసా
ట్రెయిన్ టిక్కెట్టు పోగొట్టుకున్న సందర్భాల్లో ఏం చేయాలంటే..