Share News

Viral Video: మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం మహిళ యుద్ధం..

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:52 AM

South Delhi Viral Video: ఆ ఇద్దరు మహిళలకు ఒకే డ్రెస్ నచ్చింది. దాని కోసం గొడవ మొదలైంది. ఆ గొడవకాస్తా కొద్దిసేపటి తర్వాత దారుణమైన ముష్టి యుద్దానికి దారి తీసింది. ఓ ఇద్దరు మహిళలు కలిసి మరో మహిళను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం మహిళ యుద్ధం..
South Delhi Viral Video

డ్రెస్ విషయంలో ఆడవాళ్లు ఎంత సిన్సియర్‌గా.. సీరియస్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాపులో డ్రెస్ నచ్చకపోతే.. చెప్పులు అరిగిపోయేలా 10 షాపులు తిరుగుతారే కానీ, నచ్చని డ్రెస్ మాత్రం తీసుకోరు. అందుకే ఆడవాళ్లతో కలిసి డ్రెస్ షాపింగుకు వెళ్లొద్దని అంటారు. నేను చెప్పేది మీకు ఓవర్‌గా అనిపించవచ్చు. కానీ, ఇదే నిజం.. డ్రెస్ కోసం ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారంటే.. అప్పుడు నేను చెప్పిన విషయంలో సీరియస్‌నెస్ అర్థం అవుతుంది. ఆ ఇద్దరు మహిళల గొడవకు కారణం.. ఒకే డ్రెస్ నచ్చటం. ఆ డ్రెస్ కోసం ఇద్దరూ పొట్టుపొట్టు కొట్టున్నారు. ఈ సంఘటన సౌత్ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ ఇద్దరు మహిళలు సరోజిని నగర్ మార్కెట్‌కు వెళ్లారు.


డ్రెస్ కోసం అక్కడి వీధిలోని షాపులన్నీ తిరుగుతూ ఉన్నారు. కొద్ది సేపటి తర్వాత ఇద్దరూ ఒకే షాపు దగ్గరకు వచ్చారు. ఇద్దరికీ ఒకే డ్రెస్ నచ్చింది. ఆ డ్రెస్ నాకు కావాలంటే నాకు కావాలి అంటూ ఇద్దరూ వాగ్వివాదానికి దిగారు. చినికి చినికి గాలివాన అయినట్లు.. కొద్దిసేపటి తర్వాత ఆ గొడవ తుఫానుగా మారింది. ఇద్దరూ కొట్టుకోవటం మొదలెట్టారు. లాంగ్ స్కట్ వేసుకున్న ఆమె.. బ్లూ కలర్ బ్యాగుతో ఉన్న ఆమెపై భీకరంగా దాడి చేసింది. లాంగ్ స్కట్ వేసుకున్న మహిళకు తోడుగా వచ్చిన మరో మహిళ కూడా బ్లూ కలర్ బ్యాగుతో ఉన్న మహిళపై దాడి చేసింది. అయితే.. ఈ ముష్టి యుద్ధాన్ని మొదలుపెట్టింది బ్లూ కలర్ బ్యాగుతో ఉన్న మహిళే. మొదట ఆమే స్కట్ వేసుకున్న మహిళ చెంపపై కొట్టింది. దీంతో గొడవ మొదలైంది.


ఇద్దరు ప్రత్యర్థులు కలిసి బ్లూ కలర్ బ్యాగుతో ఉన్న మహిళను చావగొట్టారు. పక్కనే ఉన్న కొంతమంది మహిళలు రంగంలోకి దిగి వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో 20సెకన్లు మాత్రమే ఉంది. అందులో గొడవ ఆగిన దృశ్యాలు లేవు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ డ్రెస్ విషయంలో ఆడవాళ్లు వారి మాట వాళ్లే వినరు. పక్కనోళ్ల మాట వింటారా?’..‘ మహా దారుణం ఈ దారుణం.. డ్రెస్ కోసం ఇంతలా కొట్టుకుంటారా? మీరసలు మహిళలేనా’..‘ ఇలాంటి వీడియోలు చూస్తుంటే దేశం ఏమైపోతుందో అనిపిస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Shiva Temple: సైంటిస్టులకే సవాల్.. 3 వేల ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం..

AIతో వింతలే

Updated Date - Apr 09 , 2025 | 07:53 AM