Traffic Funny Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. లారీని దాటి ముందుకు వెళ్లాలని చూసిన కారు.. చివరకు..
ABN, Publish Date - Feb 09 , 2025 | 06:03 PM
ట్రాఫిక్ జామ్ అవడంతో రోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన వాహనాల మధ్యలో ఓ కారు కూడా ఉంటుంది. అయితే కారు డ్రైవర్ మాత్రం.. ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చివరకు తమాషా సంఘటన చోటు చేసుకుంది..

ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఎలాగోలా ముందుకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు డ్రైవర్.. లారీలను దాటుకుని ముందుకు వెళ్లిపోవాలని చూడగా చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ జామ్ (Traffic jam) అవడంతో రోడ్డుపై వాహనాలన్నీ ఆగిపోయి ఉంటాయి. ఎడమ వైపు వాహనాలు ఆగిపోగా కుడి వైపు వాహనాలు మాత్రం ముందుకు కదులుతుంటాయి. ఆగిపోయిన వాహనాల (Car Stuck in Traffic) మధ్యలో ఓ కారు కూడా ఉంటుంది. అయితే కారు డ్రైవర్ మాత్రం.. ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు.
ఈ క్రమంలో అతను ముందు ఆగి ఉన్న లారీని దాటుకుని వెళ్తాడు. అయితే కాస్త దూరం వెళ్లగానే కుడి వైపున లారీ ఎదురుగా వస్తుంది. దీంతో కారు పూర్తిగా రోడ్డు పక్కకు వెళ్లాల్సి వస్తుంది. ఆ లారీ వెళ్లగానే మళ్లీ ముందుకు వెళ్లాలని చూడగా.. అంతలోనే మరో లారీ ఎదురుగా వస్తుంది. ఇలా ఆ వ్యక్తి ఎన్నిసార్లు ప్రయత్నించినా, అటు వైపు నుంచి లారీలు వస్తూనే ఉంటాయి. దీంతో ముందుకు కదల్లేక రోడ్డు పక్కనే ఆగిపోవాల్సి వస్తుంది.
Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టైం బాలోనేప్పుడు తొందరపడితే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘కొన్నిసార్లు ఓర్పు అనేది చాలా అవసరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 5.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Gym Viral Video: జిమ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే.. ఖంగుతింటారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 09 , 2025 | 06:03 PM