Share News

Chanakya Niti : తల్లిదండ్రులు చేసే ఈ తప్పులకు .. పిల్లలు జీవితాంతం శిక్షను అనుభవించాలి..

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:55 PM

Chanakya Niti : ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఇలా ప్రవర్తిస్తే అవి వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కన్నవారు చేసే ఈ తప్పుల పర్యవసానంగా పిల్లలు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకే, పిల్లల ముందు ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి..

Chanakya Niti : తల్లిదండ్రులు చేసే ఈ తప్పులకు .. పిల్లలు జీవితాంతం శిక్షను అనుభవించాలి..
How Parents' Errors Affect Their Kids As Per Chanakya Niti

Chanakya Niti : భారతదేశ చరిత్రలో చాలా మంది గొప్ప పండితులు ఉన్నా ఆచార్య చాణక్యుడిది ప్రత్యేక స్థానం. ఆయన మాటలు గతంలోలాగే నేటికీ నిజం. ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల చేసే కొన్ని తప్పులను కూడా ఆయన ప్రస్తావించారు. పిల్లల పెంపకంలో వారు పాటించాల్సిన కొన్ని సూత్రాలు, జాగ్రత్తలు కూడా ఇచ్చారు. అవి నేటి కాలంలోనూ ప్రజలకు చక్కగా సరిపోతాయి. చాణక్యుడి ప్రకారం తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు ఇవి పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలను తెలుసుకోవడం ద్వారా మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మారవచ్చు. మీ బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వవచ్చు.


పిల్లల తప్పులను కప్పిపుచ్చడం..

ఆచార్య చాణక్యుడి ప్రకారం పిల్లల తప్పులను దాచిపెట్టడం లేదా కావాలనే విస్మరించడం వంటివి తల్లిదండ్రులు చేస్తే వారు ఎక్కడో ఒక చోట తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడంలో పాత్ర పోషిస్తున్నారని అర్థం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. కానీ ప్రేమ అంటే మీరు వారి తప్పులను కప్పిపుచ్చడం ప్రారంభించాలని కాదు. పిల్లవాడిని కొట్టడం లేదా తిట్టడం కంటే.. వాళ్లతో కూర్చుని అర్థమయ్యేలా నెమ్మదిగా వివరించండి. ఒకవేళ మీరు కావాలని పిల్లల తప్పులను విస్మరిస్తూ ఉంటే ఏదో ఒకరోజు వారిని మార్చడం చాలా కష్టమవుతుంది.


పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోకపోతే..

తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోకపోతే అది వారి ప్రవర్తనపై చెడు ప్రభావం చూపుతుంది. నిజానికి పిల్లలకు తమ అమ్మానాన్నలే స్ఫూర్తి. వారి అలవాట్లు, ప్రవర్తన ప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి అలవాట్లనే అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఎల్లప్పుడూ మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాలి. అప్పుడు పిల్లలు కూడా అదే ప్రవర్తనను నేర్చుకుని జీవితంలో మంచి వ్యక్తిగా ఎదుగుతారు. లేకపోతే వారు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఎవరితోనూ మర్యాదపూర్వకంగా మెలగలేక అభాసుపాలవుతారు.


అబద్ధాలు చెప్పడం..

ఎక్కడో ఒకచోట తమ పిల్లలకు అబద్ధాలు చెప్పే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకు సమస్యలను సృష్టించినట్టే. ఎందుకంటే, అబద్ధాలు అనేవి ఒక వ్యక్తి జీవితంలో ముందుకు సాగడానికి అడ్డంకులు. అబద్ధాలను ఆశ్రయించినవారు కొంతకాలం బాగానే ఉన్నా ఎక్కువ కాలం అలాగే ఉండలేరు. అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు. వారితో కలిసి జీవించడానికి ఎవరూ ఇష్టపడరు. తల్లిదండ్రులే ఈ విషయాన్ని ప్రోత్సహించడం ప్రారంభిస్తే అది పిల్లల భవిష్యత్తును దుర్భరం చేస్తుంది.


అసభ్యకరమైన భాష..

తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ మర్యాదపూర్వక భాషలో మాట్లాడాలి. మీరు మీ పిల్లలతో ఏ రకమైన భాషను ఉపయోగిస్తున్నారో రేపు వారు కూడా ఇతరులతో అదే భాషను ఉపయోగిస్తారు. పిల్లలతో అరవడం, దుర్భాషలాడడం కంటే వారితో ప్రేమగా మాట్లాడండి. దీనితో తోటి వారితోనూ మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటాడు. ఈ అలవాట్లే పిల్లలు భవిష్యత్తులో గొప్పగా ఎదిగేందుకు సహకరిస్తాయి.


ఇవి కూడా చదవండి..

పారాషూట్‌తో ఎగ్జామ్ సెంటర్‌లో దిగిన విద్యార్థి! ఎందుకో తెలిస్తే..

ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..

తండ్రిపై చిన్నారి ఫిర్యాదు.. పోలీసులు వచ్చి చూస్తే..

మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 04:58 PM