Share News

ChatGPT Saves Life: 17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ

ABN , Publish Date - Apr 14 , 2025 | 10:14 PM

వైద్యులకు సాధ్యం కానిది చాట్‌జీపీటీ చేసి చూపించింది. అయితే, చాట్‌జీపీటీ ఎన్ని అద్భుతాలు చేసినా దాన్ని గుడ్డిగా నమ్మొద్దని నిపుణులు జనాలకు సలహా ఇస్తున్నారు. అసలేం జరిగిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ChatGPT Saves Life: 17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ
ChatGPT Saves Life

ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల వయసులోనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న తన తనయుడికి చూసి ఆ తల్లి బాధపడని రోజంటూ లేదు. ఆ చిన్నారి నిత్యం పంటినొప్పితో బాధపడేవాడు. నొప్పి నుంచి ఉపశమనం కోసం ఏది పడితే అది నోట్లో పెట్టుకునే వాడు. కొన్నాళ్లు బిడ్డ ఎదుగుదల కూడా నెమ్మదించింది. చివరకు అడుగుల సరిగా వేయలేక ఇబ్బంది పడసాగాడు. అమెరికా మహిళ కోర్ట్నీ ఎదుర్కొన్న పరిస్థితి ఇది.

తన తనయుడు అలెక్స్‌కు ఏమైందో ఆమెకు ఎంతకీ అర్థం కాలేదు. ఏకంగా 17 మంది వైద్యులకు బిడ్డను చూపించింది. రకరకాల పరీక్షలు చేయించింది. బాలుడి వ్యాధి ఏమిటీ ఒక్కరూ చెప్పలేకపోయారు. చివరకు విసిగిపోయిన కోర్ట్నీ బాలుడి రిపోర్టులన్నీ చాట్‌జీపీటీ ముందుంచింది. ఎమ్‌రైలు, బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, ఇలా అన్ని రకాల టెస్టుల రిపోర్టులతో పాటు బిడ్డకు వ్యాధి లక్షణాలను కూడా చాట్‌జీపీటీతో పంచుకుంది. ఈ సమాచారాన్నంతా క్షణకాలంలో విశ్లేషించిన చాట్‌జీపీటీ వెంటనే బాలుడికి టెథర్ కార్డు సిండ్రోమ్ అనే వెన్నే పూస సమస్య ఉన్నట్టు గుర్తించింది.


దీంతో, ఇలాంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్న విషయాన్ని కూడా కోర్ట్నీ గుర్తించింది. ఈ చిన్నారుల తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్న ఫేస్‌బుక్ గ్రూపుల్లో చేరింది. ఆ తరువాత గ్రూప్ సభ్యుల సలహా మేరకు ఓ ప్రముఖ న్యూరో సర్జన్‌కు కలిసింది. ఆ తరువాత బాలుడికి ఆపరేషన్ కూడా విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్న తన చిన్నారిని చూసి కోర్ట్నీ ఆనందానికి అంతేలేకుండా పోయింది.


బాలుడిని కాపాడిన చాట్‌జీపీటీపై ప్రశంసలు కురుస్తున్నా కొందరు జాగ్రత్తపరులు మాత్రం వైద్యుల సలహా లేనిదే ఏపనీ చేయకూడదని మరీ మీర చెబుతున్నారు. ఏఐ సాంకేతికత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, ఏఐలకు ఉన్న హ్యాల్యూసినేషన్ అనే సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ వంటి సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయని అన్నారు. కాబట్టి, చాట్‌జీపీటీ ఎంత ఉపయోగకరమైన సలహా ఇస్తున్నా తొందరపడకుండా ముందుగా నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో పుట్టిన నీలి వజ్రం.. త్వరలో వేలం.. ధర ఎంతో తెలిస్తే..

యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై

సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి

Read Latest and Viral News

Updated Date - Apr 14 , 2025 | 10:14 PM