Viral Video: నువ్వసలు మనిషివేనా.. అమ్మాయితో అంత నీచంగా ప్రవర్తిస్తావా..
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:05 PM
Woman Viral Video: భావ్న మాత్రం అతడ్ని వెంబడించింది. అతడు ఓ చోట సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు. అతడ్ని వీడియో తీసి, తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్లకు భద్రత లేకుండా పోయింది. బయటకు వెళ్లి.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న నమ్మకం కూడా కరువైంది. ఆడవాళ్లపై అరాచకాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే.. మగాళ్లు కాదు.. మృగాళ్లు అని పిలవటమే సరి అనిపిస్తుంది. తాజాగా, ఓ యువతితో ఓ యువకుడు తప్పుగా ప్రవర్తించాడు. తాగిన మైకంలో ఆమెను అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన భావ్న శర్మ అనే యువతి శివాజీ ఎన్‌క్లేవ్ మార్కెట్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఫుల్లుగా తాగిన ఓ యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. చీకట్లో నడుచుకుంటూ వెళుతున్న ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. భావ్నను తాకరాని విధంగా తాకాడు. సాధారణంగా ఎవరైనా అయితే, భయపడి అక్కడినుంచి పారిపోతారు. కానీ, భావ్న మాత్రం అతడ్ని వెంబడించింది. అతడు ఓ చోట సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు. ఆమె అతడ్ని వీడియో తీసింది. తర్వాత తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
‘ నేను ఇంటికి వెళుతూ ఉన్నాను. అప్పుడు టైం రాత్రి 9 గంటలు. అతడు నా వెనకాల వచ్చాడు. నాతో తప్పుగా ప్రవర్తించాడు. నేను ఒక్కమాట కూడా మాట్లాడలేకపోయాను. నేను షాక్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అతడ్ని వీడియో తీస్తుంటే.. కొంచెం కూడా భయం లేకుండా ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నట్లు ప్రవర్తించాడు. పోలీసులంటే కూడా భయం లేదు. అతడికి జైలంటే ఇంటి లాంటిది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తాగుబోతుపై ఫైర్ అవుతున్నారు. అతడికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గరుడ
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్