Share News

Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గరుడ

ABN , Publish Date - Apr 14 , 2025 | 11:40 AM

Puri Srimandir Flag: పూరీ జగన్నాథుడి ఆలయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ గరుడ పక్షి పరమ పవిత్రమైన శ్రీ మందిరం గోపురం జెండాను ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గరుడ
Puri Srimandir Virl video

భక్తుల కొంగు బంగారం పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఎంతో పరమ పవిత్రంగా భావించే పూరీ శ్రీ మందిరం గోపురం జెండాకు సంబంధించిన ముక్కను ఓ గరుడ పక్షి ఎత్తుకెళ్లింది. శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అది శ్రీ మందిరం గోపురంపై ఉండే జెండా గుడ్డ ముక్కనా కాదా అన్న దానిపై క్లారిటీ లేదు. గుడ్డ ముక్కను నోటితో కరుచుకున్న తర్వాత ఆ గరుడ పక్షి సముద్రం వైపు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత గాల్లోనే మాయం అయింది. గరుడ పక్షి ఎత్తుకెళ్లిన గుడ్డ ముక్కపై గుడి అధికారులు స్పందించలేదు.


ఈ సంఘటన శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జెండా మిస్టరీ గురించి తెలిసిన వాళ్లు.. ఇదంతా దేవుడి మహిమే అని అనుకుంటున్నారు. ఆలయ అధికారులు స్పందిస్తే గానీ, అందులో వాస్తవం ఎంతుందో తెలియదు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ పరమ పవిత్రమైన ఆ జెండా ముక్కను గరుడ్మంతుడు ఎత్తు కెళ్లాడు. చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంది’..‘ ఇదంతా దేవుడి లీల.. ఆ గ్రద్ద జెండాను ఎత్తుకెళ్లి .. సముద్రం వైపు వెళ్లి మాయమైంది. అది కచ్చితంగా దేవుడి దగ్గరకు వెళ్లి ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


జెండా మిస్టరీ

పూరీ జగన్నాథుడి ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో జెండా రహస్యం కూడా ఒకటి. సాధారణంగా ఏదైనా వస్తువు.. గాలి ఎటు వీస్తే అటు వైపుగా వెళతాయి. అలాంటిది గుడ్డ ముక్క అయితే... గాలి వీస్తున్న వైపు రెపరెపలాడుతుంది. కానీ, ఇక్కడ శ్రీ మందిరం గోపురం పైన ఉండే జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేకంగా రెప రెపలాడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోందో ఎవ్వరికీ అంతుచిక్కటం లేదు. భక్తులు దీన్ని పూరీ జగన్నాథుడి లీలగా భావిస్తారు. ఈ జెండాను ‘పతితపావన బనా’ అని పిలుస్తారు. జెండాను ప్రతీ రోజు మారుస్తూ ఉంటారు.


ఇవి కూడా చదవండి

Nitin Gadkari: హైవేల బలోపేతానికి 10 లక్షల కోట్లు

Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్

Updated Date - Apr 14 , 2025 | 12:40 PM