Viral Video: ఇలాంటి స్విచ్ బోర్డును ఎక్కడైనా చూశారా.. ఈ ఎలక్ట్రీషియన్‌‌ ఎవరో గానీ దండం పెట్టొచ్చు..

ABN, Publish Date - Jan 22 , 2025 | 01:58 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తుంటారు. తాజాగా..

Viral Video: ఇలాంటి స్విచ్ బోర్డును ఎక్కడైనా చూశారా..  ఈ ఎలక్ట్రీషియన్‌‌ ఎవరో గానీ దండం పెట్టొచ్చు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను అందరినీ తెగ ఆకట్టుకుంటుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తుంటారు. తాజాగా, ఓ వినూత్న ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. వినూత్నమూన స్విచ్ బోర్డును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా ‘‘ఈ ఎలక్ట్రీషియన్‌‌ ఎవరో గానీ దండం పెట్టొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలక్ట్రీషియన్‌ (Electrician) తయారు చేసిన స్విచ్ బోర్డును (Switch board) చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఫ్యాన్, లైట్లు స్విచ్ వేయగానే వెలుగుతాయి. ఇతను కూడా ఇలాగే తయారు చేశాడు. మరి ఇందులో ఇతను ప్రత్యేకంగా చేసిందేంటీ.. అనే సందేహం రావొచ్చు. ఇతను తయారు చేసిన బోర్డులో స్విచ్‌లను వినూత్నంగా సెట్ చేశాడు.

Viral Video: హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు..


లైట్, ఫ్యాన్ ఇలా అన్నింటికీ స్విచ్ వేయగానే వెలిగేలా సెట్ చేశాడు. అయితే చివర్లో దోమల వికర్షక లిక్విడ్ మిషిన్‌ను ఆన్ చేసేందుకు విచిత్ర ఏర్పాట్లు చేశాడు. లైట్లు, ఫ్యాన్‌ల తరహాలో స్విచ్ వేయగానే ఈ మిషిన్ ఆన్ కాలేదు. అయితే ఆ స్విచ్‌తో పాటూ లైట్ స్విచ్‌ను ఒకేసారి ఆన్ చేస్తే మాత్రమే ఈ లిక్విడ్ మిషిన్ ఆన్ అవుతోంది. ఇలా రెండు స్విచ్‌లు ఒకేసారి వేస్తేనే అది పని చేసేలా విచిత్రంగా ఫిక్స్ చేశాడు.

Viral Video: చనిపోయిన వ్యక్తిని నరకానికి పంపించడమంటే ఇదే.. చుట్టూ చేరి వీళ్లు చేస్తున్న నిర్వాకం చూడండి..


ఈ ఎలక్ట్రీషియన్‌ తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బోర్డుకు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవ్వబడింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎలక్ట్రీషియన్‌‌కు అవార్డు ఇవ్వొచ్చు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 44 వేలకు పైగా లైక్‌లు, 9.87 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత మందికైనా చిటికెలో చపాతీలు.. ఈమె ట్రిక్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 22 , 2025 | 01:58 PM