Woman Theft Video: వామ్మో.. ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. చీరలను ఎలా చోరీ చేసిందో చూస్తే..
ABN, Publish Date - Mar 23 , 2025 | 07:43 AM
ఓ వస్త్ర దుకాణంలో కొందరు మహిళలు చీరలు చూస్తుంటారు. అక్కడే ఇద్దరు మహిళలు నిలబడి తమకు కావాల్సిన చీరలను చూసుకుంటుంటారు. అయితే ఇంతలో ఓ మహిళ చీరలను ఎంతో తెలివిగా చోరీ చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో.. ఇలాక్కూడా చోరీ చేస్తారా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఒక్కో దొంగ ఒక్కో స్టైల్లో చోరీలు చేస్తుంటారు. కొందరు తెలివిగా చోరీలు చేస్తే.. మరికొందరు అతి తెలివిగా చోరీలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇంకొందరు చోరీలు చేసే విధానం చూసి ఏకంగా పోలీసులే అవాక్కవుతుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ చీరల దుకాణంలో చోరీ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి చోరీ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వస్త్ర దుకాణంలో కొందరు మహిళలు చీరలు చూస్తుంటారు. అక్కడే ఇద్దరు మహిళలు నిలబడి తమకు కావాల్సిన చీరలను చూసుకుంటుంటారు. వారిలో ఓ మహిళ చేతులతో చీరను పట్టుకుని తేరిపారా చూస్తుంటుంది.
Bus viral video: ఈ బస్సు చల్లగుండ.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూస్తే నోరెళ్లబెడతారు..
ఆ సమయంలో ఆమె వెనుకే నిలబడ్డ మహిళ.. అక్కడే ఉన్న కొన్ని చీరలను (woman stole sarees) చేతిలోకి తీసుకుని, వాటిని తన రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుంటుంది. తర్వాత యథావిధిగా నిలబడి చీరలను పరిశీలిస్తుంటుంది. తర్వాత ఆ ఇద్దరు మహిళలూ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Theft viral video: భక్తిలో ఈ దొంగ ఏమాత్రం తక్కువ కాడు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చోరీలు ఇలాక్కూడా చేస్తారా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి మహిళల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 1.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 23 , 2025 | 07:43 AM