Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

ABN, Publish Date - Jan 21 , 2025 | 11:39 AM

ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి లవ్ ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాస్త వినూత్నంగా ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో చేతిలో ఓ రోజా పువ్వుతో ఆమె వద్దకు వెళ్లాడు. స్నేహితులతో మాట్లాడుతున్న యువతి వద్దకు వెళ్లి..

Viral Video: అమ్మాయికి ప్రపోజ్ అయితే చేశాడు కానీ.. చివర్లో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు..

ప్రస్తుతం చాలా మంది యువకులు తాము ఇష్టపడే యువతులకు వివిధ రూపాల్లో లవ్ ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. తర్వాత వారి ప్రేమను యువతులు ఎంత వరకూ అంగీకరిస్తారో తెలీదు గానీ.. లవ్ ప్రపోజ్ చేసే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు యువతుల చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వస్తే.. మరికొన్నిసార్లు అందరి ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు యువతికి రోజా పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. అయితే చివరలో చోటు చేసుకున్న ఘటనతో ఖంగుతిన్నాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తాను ఇష్టపడ్డ యువతికి (young woman) లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కాస్త వినూత్నంగా ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో చేతిలో ఓ రోజా పువ్వుతో ఆమె వద్దకు వెళ్లాడు. స్నేహితులతో మాట్లాడుతున్న యువతి వద్దకు వెళ్లి చేయి తట్టి పిలుస్తాడు. ఆ వెంటనే మోకాళ్లపై నిల్చుని ఆమె చేతికి రోజా అందింది లవ్ ప్రపోజ్ చేసేశాడు.

Viral Video: అరే..! ఇది మాయా లేక మంత్రమా.. కరెంట్ బిల్లు తగ్గించేందుకు వింత ట్రిక్.. చూస్తే షాకవ్వాల్సిందే..


అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోజా పువ్వు అందించిన తర్వాత పైకి లేచి నిలబడి ఆమె ముందు విభిన్నమైన ఫోజ్ పెట్టి ఏదో చెప్పాలన ప్రయత్నించేలోగా అతడి ఫ్యాంట్ ఊడిపోతుంది. దీంతో అక్కడున్న యువతులంతా పగలబడి నవ్వుకుంటారు. ఫ్యాంట్ ఊడిపోవడంతో అవాక్కైన యువకుడు.. తర్వాత అక్కడి నుంచి పారిపోయి పరువు దక్కించుకుంటాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ఐఫోన్ దొంగను చితకబాదిన యువకులు.. మధ్యలో ఫోన్ స్ర్కీన్ చూడగా షాకింగ్ సీన్.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లవ్ ప్రపోజ్ చేయాలని వెళ్తే పరువు మొత్తం పోయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం భలే యాక్టింగ్ చేశారుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100కి పైగా లైక్‌లు, 1.31 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 21 , 2025 | 11:39 AM