Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

ABN, Publish Date - Jan 18 , 2025 | 09:14 PM

ఓ కుటుంబం ఇల్లు మారుతున్న సందర్భంగా సమాన్లన్నింటినీ ఆటోలో వేసుకుని బయలుదేరింది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వారు వెళ్తున్న ఆటో వెనుక వైపు చూసి అంతా ప్రశంసిస్తున్నారు. అయితే వారి ఆటో వెనుక వైపు చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Viral Video: ఇల్లు మారుతూ  మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

మానవత్వం రోజురోజుకూ మంటగలిసిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఎదుటి వారి నుంచి స్వచ్ఛమైన ప్రేమను కోరుకోవడం అత్యాశే అవుతుంది. అయితే అంతా ఇలాగే ఉంటారునుకుంటే పొరపాటే. మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కుటుంబం ఇల్లు మారుతూ అందరి మనసులనూ గెలుచుకుంది. లగేజీ తీసుకెళ్తున్న ఆటోను చూసి అంతా వారిని అభినందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం ఇల్లు మారుతున్న సందర్భంగా సమాన్లన్నింటినీ (Family household goods Shifting) ఆటోలో వేసుకుని బయలుదేరింది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వారు వెళ్తున్న ఆటో వెనుక వైపు చూసి అంతా ప్రశంసిస్తున్నారు. ఆటోలో సమాన్లను వేసుకున్న తర్వాత కొందరు వాటిపై కూర్చున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో దుప్పట్లు కప్పుకుని కూర్చున్నారు.

Viral Video: కాటేయకుండానే చుక్కలు చూపించిన పాము.. చేత్తో పట్టుకోవడంతో ఇతడికేమైందో మీరే చూడండి..


అయితే మార్గ మధ్యలో ఆ దుప్పటిలో నుంచి వారి పెంపుడు కుక్క (pet dog) తల బయటికి పెట్టి చూసింది. దీంతో వారు దానికి ఎక్కడ చలి వేస్తుందో అని మళ్లీ దుప్పటి కప్పేశారు. ఇలా ఇల్లు మారుతున్నా కూడా వారి పెంపుడు కుక్కను ఎంతో జాగ్రత్తగా తమతో పాటూ తీసుకెళ్లడం చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆటో వెనుక వైపు వెళ్తున్న వాహనంలోని వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: యోగాలో పండిపోయిన ఏనుగు.. వీడియో చూస్తే ముక్కున వేలేసుకుంటారు..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరి మనసు ఎంతో గొప్పది.. పెంపుడు జంతువులను సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు..’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చెట్టుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. బొప్పాయిని బలవంతంగా కోయాలని చూడగా.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..

Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 18 , 2025 | 09:18 PM