Viral Video: తప్పు చేసింది ఒకరైతే.. బలైంది మరొకరు.. ట్రాఫిక్‌లో ఈ బైకర్ నిర్వాకం చూస్తే..
ABN, Publish Date - Feb 09 , 2025 | 09:12 PM
రోడ్డుపై ట్రాఫిక్ జామ్ కావడంతో కార్లన్నీ ఆగిపోయి ఉంటాయి. అయితే కొందరు బైకర్లు మాత్రం కార్ల మధ్యలో ఉన్న గ్యాప్‌లో నుంచి ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..

కొన్నిసార్లు మంచి చేయాలని చూస్తే.. చివరకు చెడు ఎదురవుతుంటుంది. మరికొన్నిసార్లు తప్పు ఒకరు చేస్తే.. చివరకు ఆ తప్పునకు ఇంకొకరు బలవుతుంటారు. ఇందుకు నిదర్శంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలన్నీ వీడియోల రూపంలో నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు బైకులో వెళ్తూ కారు సైడ్ మిర్రర్‌ను తగులుతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ (Traffic jam) కావడంతో కార్లన్నీ ఆగిపోయి ఉంటాయి. అయితే కొందరు బైకర్లు మాత్రం కార్ల మధ్యలో ఉన్న గ్యాప్‌లో నుంచి ముందుకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ బైకర్ రెండు కార్ల మధ్యలో దూరి ముందుకు వెళ్తుంటాడు.
Metro Viral Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న వ్యక్తి.. సడన్‌గా మీద పడిపోయిన యువతి.. చివరకు..
అయితే ఈ క్రమంలో కారు సైడ్ మిర్రర్‌కు చేయి గట్టిగా తాకడంతో (biker broke car's side mirror) పూర్తిగా వెనక్కు తిరుగుతుంది. ఆ వెనుకే మరో బైకులో వెళ్తున్న వ్యక్తి.. అడ్డు తొలగించేందుకు కారు అద్దాన్ని లోపలికి తోస్తాడు. అయితే అప్పటికే ఆ అద్దం పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. ఇది చూడగానే ఆ బైకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎవరో చేసిన తప్పునకు ఇంకెవరో బలవడం అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ బైకర్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 500కి పైగా లైక్‌లు, 16 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Love Propose Video: కేక్ తినిపించి లవ్ ప్రపోజ్ చేశాడు.. యువతి తిరస్కరించడంతో.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 09 , 2025 | 09:12 PM