Viral Video: ఇంట్లో పెద్ద వాళ్లు ఉండాలనేది ఇందుకే.. ఈ చిన్నారిని తాత ఎలా కాపాడాడో చూడండి..
ABN, Publish Date - Jan 11 , 2025 | 06:49 PM
ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో ఏ ఇంట్లో చూసినా భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కనిపిస్తుంటారు. వృద్ధులు కనిపించే ఇళ్లు చాలా తక్కువగా ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో పెద్ద వారు ఉంటే కుటుంబ సభ్యులకు నడవడిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ..
ప్రస్తుత ఉరుకు పరుగుల జీవితంలో ఏ ఇంట్లో చూసినా భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కనిపిస్తుంటారు. వృద్ధులు కనిపించే ఇళ్లు చాలా తక్కువగా ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో పెద్ద వారు ఉంటే కుటుంబ సభ్యులకు నడవడిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది పిల్లలకు ఇలాంటి అవకాశమే లేకుండా పోతోంది. ఇంట్లో పెద్దలు ఉంటే ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనేందుకు నిర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఇంట్లో పెద్ద వాళ్లు ఉండాలనేది ఇందుకే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు. అక్కడే గోడ పక్కన నీళ్ల బకెట్‌లో హీటర్ పెట్టి ఉంచారు. అయితే ఆడుకుంటున్న చిన్నారి చివరకు బకెట్ వద్దకు వెళ్లి నిలబడ్డాడు. బకెట్‌లోని హీటర్‌ను తాకబోతుండగా.. అక్కడే ఉన్న పిల్లాడి తాతయ్య గమనిస్తాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని పట్టుకుని పైకి ఎత్తుకుంటాడు.
ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోతాడు. అయినా చిన్నారికి ఎలాంటి గాయాలూ కాకుండా (grandfather saved the child) జాగ్రత్తగా పట్టుకుని ఉంటాడు. ఇంతలో పిల్లాడి తల్లిదండ్రులు పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. వృద్ధుడు జరిగిన ఘటనను వారికి వివరించి, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తాడు.
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇళ్లల్లో పెద్దవారు ఉండాలని చెప్పేది ఇందుకే’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా సోషల్ మెసేజ్ కోసం చిత్రీకరించినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 58 వేలకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ మొసలి ఎర మామూలుగా లేదుగా.. మనుషులను ఎలా నమ్మిస్తోందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 11 , 2025 | 06:49 PM