Share News

నడిరాత్రి అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. క్షమాపణ చెప్పిన హోం మంత్రి

ABN , Publish Date - Apr 08 , 2025 | 11:33 AM

Karnataka Home Minister G Parameshwara: శుక్రవారం అర్థరాత్రి వీధిలో వెళుతున్న ఇద్దరు యువతులపై గుర్తు తెలియన ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారి వెంట పడి వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నడిరాత్రి అమ్మాయిలకు లైంగిక వేధింపులు.. క్షమాపణ చెప్పిన హోం మంత్రి
Bengaluru News

బెంగుళూరులో నడిరాత్రి.. రోడ్డుపై వెళుతున్న అమ్మాయిలపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ మొదలైంది. ఆడవాళ్లకు భద్రత లేదంటూ నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర స్పందించారు. ‘ బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇలాంటి సంఘటనలు జరగటం అన్నది సర్వసాధారణం. నిందితులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము. రాత్రి పహారా పక్కాగా ఉండాలని పోలీసులకు చెప్పాను’ అని అన్నారు.


హోం మంత్రి చేసిన ఈ కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీతో పాటు మహిళా సంఘాలు కూడా హోం మంత్రి కామెంట్లపై గరం గరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం మంత్రి మరోసారి స్పందించారు. నిన్న చేసిన కామెంట్లపై క్షమాపణ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిన్న నేను చేసిన కామెంట్లను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళల భద్రత గురించి ఆలోచించే వారిలో నేను ముందు వరుసలో ఉంటాను. నిర్భయ ఫండ్స్ సక్రమంగా వినియోగించటంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాను. నా కామెంట్లను వక్రీకరించటం నచ్చలేదు. నా మాటల వల్ల మహిళలు బాధపడి ఉంటే.. నన్ను క్షమించండి’ అని అన్నారు.


ఆ రాత్రి ఏం జరిగింది?..

ఏప్రిల్ 4 శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రాత్రి 1.32 గంటల సమయంలో బెంగళూరు, భారతీ లేఅవుట్‌లోని వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళుతున్నారు. అర్థరాత్రి దాటడంతో రోడ్డు మొత్తం నిర్మానుషంగా ఉంది. కొంతదూరం పోయిన తర్వాత ఓ గుర్తుతెలియని యువకుడు వారి వెంటపడ్డాడు. ఆ ఇద్దరిలో ఓ యువతిని పట్టుకున్నాడు. ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. యువతిని గట్టిగా పట్టుకుని.. ఆమె దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరు యువతులు గట్టిగా అరవటం మొదలెట్టారు. భయపడిపోయిన దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.


ఇవి కూడా చదవండి:

Dearness Allowance: ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై ఏడాదికి రెండు సార్లు డీఏ

Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..నిన్నటి నష్టాలకు బ్రేక్ పడుతుందా..

Updated Date - Apr 08 , 2025 | 11:35 AM