Holi Viral Video: ఈనో టెక్నిక్ ఏదో అదిరిందిగా.. హోలీ రంగులను ఎలా శుభ్రం చేస్తున్నాడో చూడండి..
ABN, Publish Date - Mar 14 , 2025 | 09:22 PM
హోలీ సందర్భంగా రంగులు చల్లుకున్న యువకుడు.. తర్వాత తన చేతికి అంటిన రంగులను శుభ్రం చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంటిన రంగులను సులభంగా ఎలా తొలగించవచ్చో చేసి చూపించాడు.

హోలీ పండుగ సందర్భంగా దేశం మొత్తం రంగుల్లో మునిగిపోయిందని చెప్పొచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో రంగులు కడుక్కోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఎంత కడిగినా రంగులు చేతులు, కాళ్లు, ముఖానికి అంటుకునే ఉంటాయి. అయితే ఓ యువకుడు ఈ సమస్యకు విచిత్రమైన పరిష్కారం కనుక్కున్నాడు. ఈనోతో అడడు చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోలీ (Holi) సందర్భంగా రంగులు చల్లుకున్న యువకుడు.. తర్వాత తన చేతికి అంటిన రంగులను శుభ్రం చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంటిన రంగులను సులభంగా ఎలా తొలగించవచ్చో చేసి చూపించాడు.
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..
ఇందుకోసం ముందుగా తన చేతిలో కొంచెం షాంపూ (Shampoo) వేసుకున్నాడు. ఆ తర్వాత నిమ్మకాయ రసం (lemon juice) పిండి కలిపాడు. చివరకు అందులో ఈనో (Eno) వేసి మొత్తం మిక్స్ చేసి, రెండు చేతులను బాగా రుద్దాడు. చివరగా నీళ్లు పోయగా రంగు కనిపించకుండా పూర్తిగా తొలగిపోయింది. ఇలా ఈనోతో రంగులు పూర్తిగా శుభ్రం చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Escalator Funny Video: మనసు మాట మాత్రమే వింటాడేమో.. ఎస్కలేటర్‌పై ఏం చేస్తున్నాడో చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిమ్మకాయ, వెనిగర్‌తోనూ రంగులు శుభ్రం చేసుకున్నాం’’.., ‘‘ఇది వ్యూస్ కోసం చేశారు.. మేము చేసి చూస్తే రంగు పోలేదు’’.., ‘‘ఇలాంటి ప్రయోగాలు ముఖంపై చేయొద్దు’’.., ‘‘ఇతడికి అవార్డు ఇచ్చి తీరాల్సిందే’’.., ‘‘ఈనోను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3800కి పైగా లైక్‌లు, 5.15 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tiger Viral Video: రీల్స్ చూస్తున్న యువకుడు.. మంచం వద్దకు వచ్చిన పులి.. చివరకు చూస్తే..
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 14 , 2025 | 09:22 PM