Viral Video: ప్రాణం పోయినా ఫర్వాలేదు.. విన్యాసాలు మాత్రం చేయాల్సిందే.. ఇతడి నిర్వాకం చూస్తే కళ్లు తేలేస్తారు..
ABN, Publish Date - Jan 03 , 2025 | 09:56 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు బహిరంగ ప్రదేశాల్లో చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఇంకొందరు ప్రాణాలు పోతాయని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారు చేసే షాకింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ప్రాణాలు పోతున్నా కూడా విన్యాసాలు చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎత్తైన భవనంపై నిలబడి విన్యాసాలు (stunts) చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే బిల్డింగ్‌పై చేయాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా పైనుంచి గింగిరాలు (man jumped from the top of building) తిరుగుతూ కిందకు దూకేస్తాడు. పైనుంచి కిందకు దూకే క్రమంలో ఇనుప కడ్డీలు, గోడలను తాకుతూ తీవ్ర గాయాలతో కిందపడిపోతాడు.
Viral Video: న్యూఇయర్ వేడుకలను ఇలా చేసుకోవడం ఏంట్రా బాబోయ్.. కారుతో సహా భూమిలో పాతి పెట్టడంతో..
అంత పెద్ద భవంనంపై నుంచి కిందపడ్డ అతను గాయాలతో కాసేపు చలనం లేకుండా పడిపోతాడు. ఆ తర్వాత మళ్లీ సైకి లేచి తలకిందులుగా వెనక్కు పల్టీలు కొడతాడు. ఈ క్రమంలో తల నేలకు బలంగా తాకుతుంది. దీంతో తర్వాత ఎలాంటి చలనం లేకుండా అలాగే ఉండిపోతాడు. ఈ ఘటన మొత్తం ఎదురు బిల్డింగ్‌పై ఉన్న వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
Viral Video: ఈ చీమల ముందు పెద్ద పెద్ద ఇంజినీర్లు కూడా దిగుదుడుపే.. నీటిపై ఏం చేశాయో మీరే చూడండి..
ఇది ఎంత వరకు నిజమో, ఎంత వరకు అబద్ధమో తెలీదు కానీ... ప్రస్తుతం ఈ విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో.. ఇది నిజమా లేక గ్రాఫిక్సా’’.. అంటూ కొందరు, ‘‘ఇదెలా సాధ్యం.. అంత పైనుంచి పడ్డా కూడా మళ్లీ విన్యాసాలు చేయడం ఏంటో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 260కి పైగా లైక్‌లు, 48 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 03 , 2025 | 09:56 PM