Viral Video: బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం.. పదో అంతస్థు నుంచి ఎలా వదిలాడో చూడండి..

ABN, Publish Date - Feb 08 , 2025 | 10:56 AM

ఓ వ్యక్తి పదో అంతస్థుపై ఉన్నాడు. కింద తన స్నేహితులు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అయితే ఈ సందర్భంగా వారికి ఓ బ్యాడ్మింటన్ రాకెట్ అవసరం పడింది. దీంతో బిల్డింగ్ పైన ఉన్న యువకుడు తన వద్ద ఉన్న రాకెట్‌ను కిందకు పంపిచాల్సి వచ్చింది. చివరకు ఏం జరిగిందో చూడండి..

Viral Video: బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం.. పదో అంతస్థు నుంచి ఎలా వదిలాడో చూడండి..

కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరికొందరు ఎవరూ చేయని ప్రయోగాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇంకొందరు వివిధ రకాల టెక్నిక్‌లతో చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ రాకెట్‌తో వింత ప్రయోగం చేశాడు. పదో అంతస్థు నుంచి కిందకు ఎలా వదిలాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పదో అంతస్థుపై ఉన్నాడు. కింద తన స్నేహితులు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. అయితే ఈ సందర్భంగా వారికి ఓ బ్యాడ్మింటన్ రాకెట్ (badminton racket) అవసరం పడింది. దీంతో బిల్డింగ్ పైన ఉన్న యువకుడు తన వద్ద ఉన్న రాకెట్‌ను కిందకు పంపిచాల్సి వచ్చింది. అయితే ఇందుకోసం తాను కిందకు రాకుండా, అలాగని రాకెట్‌ను నేరుగా విసిరేయకుండా.. ఓ వినూత్నమైన ట్రిక్ వాడాడు.

Viral Video: ఇంటి నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే ఇదే జరుగుతుంది.. స్లాబ్ వేస్తుండగా ఉన్నట్టుండి..


బ్యాడ్మింటన్ రాకెట్‌‌కు పొడవాటి పాలిథిన్ కవర్ కట్టాడు. ఆ తర్వాత దాన్ని పైనుంచి కిందకు వదిలేశాడు. దీంతో ఆ రాకెట్ నేరుగా కిందపడకుండా పారాచ్యూట్ తరహాలో మెల్లిగా కిందకు దిగింది. అటూ, ఇటూ కదలకుండా ఒకే దిశలో మెల్లిగా కిందకు వెళ్లింది. రాకెట్ కోసం కింద ఓ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. చివరకు ఆ రాకెట్ సేఫ్‌గా అతడి చేతుల్లో ల్యాండ్ అయిందన్నమాట. ఇలా బ్యాడ్మింటన్ రాకెట్‌ను విచిత్రంగా పారాచ్యూట్ తరహాలో కిందకు దింపడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Optical illusion: మీ కంటి చూపు బాగుందా.. అయితే ఈ చిత్రంలో దాక్కున్న మరో మనిషిని 10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడికి భౌతిక శాస్త్రం బాగా తెలిసినట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘పవర్‌ఫుల్ ఐడియాస్ కమ్ ఫ్రం పవర్‌ఫుల్ పీపుల్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 లక్షలకు పైగా లైక్‌లు, 21.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గుండెను పిండేసే సీన్.. కుంభమేళాలో ఈ పెద్దాయన చేస్తున్న పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 10:56 AM