Viral Video: గాలిలోకి ఎగిరాడు.. గాడిదపై పడ్డాడు.. ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా..
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:25 PM
సోషల్ మీడియాలో విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే విన్యాసాలు చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా..
సోషల్ మీడియాలో విన్యాసాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే విన్యాసాలు చూస్తే కొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. మరికొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి విచిత్ర విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గాలిలో ఎగిరి గాడిదపై కూర్చున్న విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి విన్యాసం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గాడిద (Donkey) వెనుక నిల్చుని విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. గాడిద వెనుక నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడున్న రాయిపై కాలు పెట్టి.. ఒక్కసారిగా గాల్లోకి జంప్ చేశాడు. గాల్లోనే పల్టీలు కొడుతూ చివరగా సరిగ్గా గాడిదపై కూర్చున్నాడు. ఈ విన్యాసాన్ని అతను ఎంతో చాకచక్యంగా చేశాడు.
Viral: వామ్మో.. ఎంతకు తెగించార్రా బాబోయ్.. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగులో షాకింగ్ సీన్..
ఈ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కిందపడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఇతను మాత్రం ఎంతో అవలీలగా గాడిదపైకి జంప్ చేసి (man flipped on donkey) అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇతడి విన్యాసాన్ని చూసి కొందరు నవ్వుకుంటుండగా.. మరికొందరు అతడిని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
Viral Video: వామ్మో.. ఏందిరయ్యా ఇదీ.. లోకల్ ట్రైన్ ఇలా ఎక్కడం ఎక్కడైనా చూశారా..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. నీ టాలెంట్ సూపర్ బ్రదర్’’.., ‘‘గాడిదను ఇబ్బంది పెట్టడం సరికాదు’’.., ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘పాపం గాడిదకు వెన్ను నొప్పి కలిగి ఉంటుంది’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 46 వేలకు పైగా లైక్‌లు, 1.8 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఒకే ఒక్కడు వణికించాడుగా.. రైలు పట్టాలపైకి వచ్చిన సింహం పరిస్థితి.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 10 , 2025 | 12:25 PM