Gym Viral Video: జిమ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే.. ఖంగుతింటారు..

ABN, Publish Date - Feb 09 , 2025 | 03:51 PM

ఓ వ్యక్తి జిమ్‌‌లో కసరత్తులు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వెల్లకిలా పడుకున్న అతను చేతులపై బరువులను లిఫ్ట్ చేయాలని అనుకున్నాడు. అది అతడి శక్తికి మించిన పని అని తెలిసి కూడా బరువులు ఎత్తేందుకు ఫిక్స్ అయ్యాడు. బరువు ఎత్తే సమయంలో..

Gym Viral Video: జిమ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే.. ఖంగుతింటారు..

ప్రస్తుత యువత శరీర ధారుఢ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేయడం సర్వసాధరమైంది. కొందరు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బాడీ కోసం తీవ్రంగా కృషి చేస్తుంటారు. అయితే కొందరు అవగాహన లేక చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో ఓ వ్యక్తి కసరత్తులు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి జిమ్‌‌లో కసరత్తులు చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వెల్లకిలా పడుకున్న అతను చేతులపై బరువులను లిఫ్ట్ చేయాలని అనుకున్నాడు. ఇనుప రాడ్‌కు రెండు వైపులా (man doing exercises in gym) చాలా బరువైన డంబెల్స్‌ను తగిలించారు. అది అతడి శక్తికి మించిన పని అని తెలిసి కూడా బరువులు ఎత్తేందుకు ఫిక్స్ అయ్యాడు. బరువు ఎత్తే సమయంలో ఓ యువతి అక్కడికి వచ్చి అతడికి సాయం చేసింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: బస్సు ఎక్కుతున్న మహిళ.. వెనుకే వెళ్లిన యువకుడు.. చివరకు అతడు చేసిన నిర్వాకంతో..


బరువును చేత్తో ఎత్తి పట్టుకున్న అతను.. వాటిని బ్యాలెన్స్ చేసుకోలేక మీద వేసుకున్నాడు. అంతలోనే అది కాస్త గొంతుపై పడుతుంది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడతాడు. అక్కడే ఉన్న యువతి పరుగెత్తుకుంటూ వచ్చి అతడికి సాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే బరువు ఎక్కువగా ఉండడంతో ఎత్తడం ఆమె వల్ల కూడా సాధ్యం కాదు. ఇంతలో అతను కిందకు జారిపోయి, ఎలాగోలా బయటపడతాడు. సమయానికి చాకచక్యంగా ప్రవర్తించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Viral Video: దండ వేస్తున్నారా.. దండిస్తున్నారా.. ఈ వరుడికి పెద్ద చిక్కే వచ్చిపడిందిగా..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘సాధ్యం కాకపోయినా యువతి ప్రయత్నం చేయడం గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘పరిమితికి మించిన బరువులు ఎత్తితే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా లైక్‌లు, మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 09 , 2025 | 03:51 PM