Funny Viral Video: పెళ్లిలో భోజనం చేస్తున్న వ్యక్తి.. వెనుక నుంచి వీళ్లు చేసిన పని చూస్తే..
ABN, Publish Date - Jan 23 , 2025 | 01:03 PM
ఓ వివాహ కార్యక్రమంలో అతిథులంతా భోజనాల వద్ద గుమికూడారు. అంతా ప్లేట్లు పట్టుకుని ఎవరికి కావాల్సిన ఆహారం వారు వడ్డించుకుని తింటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది..

ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి మంటపంలోకి వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి, భోజనాలు దాకా ప్రతి చిన్న సంఘటన కూడా వీడియో రూపంలో వైరల్ అవుతోంది. వీటిలో కొన్ని వీడియోలు నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, పెళ్లిలో భోజనాలు చేస్తున్న అతిథుల వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ప్లేటు తీసుకుని భోజనం చేయాలని ప్రయత్నించగా.. తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో అతిథులంతా భోజనాల వద్ద గుమికూడారు. అంతా ప్లేట్లు పట్టుకుని ఎవరికి కావాల్సిన ఆహారం వారు వడ్డించుకుని తింటున్నారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంది. అందరితో పాటూ అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి.. టేబుల్‌పై ఉన్న తందూరి రోటీ తీసుకుని ప్లేటులో వేసుకుంటాడు.
Viral Video: ఇది కడుపా లేక కాంక్రీటా.. ఇటుకతో ఇతను ఏం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
రోటీని ప్లేటులో వేసి అతను మరో ఫుడ్ కోసం మళ్లీ టేబుల్‌పై చూస్తుంటాడు. అయితే వెనుక ఉన్న వ్యక్తి అతడి ప్లేటులోని (Man Stole Food From Plate) తందూరి రోటీని తీసేసుకుంటాడు. తన ప్లేటు ఖాళీగా ఉండడాన్ని చూసి అవాక్కైన ఆ వ్యక్తి.. ఇంకో రోటీ తీసుకుంటాడు. అయితే ఆ రోటీని ఇలా ప్లేటులో వేసి అలా చూడగానే.. పక్కనే ఉన్న ఓ యువతి దాన్ని తీసుకుని దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. తన ప్లేటులోని రోటీ రెండో సారి కూడా మాయమవడం చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ‘‘అసలు ఏం జరుగుతోంది ఇక్కడ’’.. అంటూ చిరాకుపడిపోతాడు.
Stunt Viral Video: కారు టైరును ఇలా మార్చడం ఎప్పుడైనా చూశారా.. ఇతడి టాలెంట్ చూశారంటే..
ఇదంతా చూస్తుంటే నవ్వుకోవడం కోసం కావాలని ఇలా చేసినట్లు అనిపిస్తున్నా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లిళ్లలో ఇలాంటి సరదా సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దొంగల కోసం నరకంలో ప్రత్యేక శిక్షలు ఉంటాయి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8700కి పైగా లైక్‌లు, 7.87 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Prank video: రోడ్డుపై రూ.500 నోటును చూసి భయపడుతున్న జనం.. ఇంతకీ ఇతను ఏం చేశాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 23 , 2025 | 01:03 PM