Love Propose Video: కేక్ తినిపించి లవ్ ప్రపోజ్ చేశాడు.. యువతి తిరస్కరించడంతో.. చివరకు..
ABN, Publish Date - Feb 09 , 2025 | 06:40 PM
ఓ యువకుడు కారులో యువతి వద్దకు వెళ్లాడు. ఆమె వద్దకు కేక్ తీసుకెళ్లి తినిపించి, ప్రపోజ్ చేయాలని చూస్తాడు. అయితే ఇందుకు ఆమె తిరస్కరిస్తుంది. కేక్ తినకుండా తల పక్కకు తిప్పుకొంటుంది. దీంతో చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొన్ని రోజుల్లో ప్రేమికుల రోజు రానుండడంతో ఇప్పటి నుంచే ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. యువతీయువకులు తమకు ఇష్టమైన వారికి చిత్రచిత్రంగా ప్రేమ సందేశాలు పంపిస్తున్నారు. మరికొందరు నేరుగా వారి వద్దకే వెళ్లి తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు చిత్రవిచిత్ర పద్ధతుల్లో లవ్ ప్రపోజ్ చేయడం చూస్తున్నాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు కేక్ తినిపించి యువతికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో చివరకు అతను ఏం చేశాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వీడియోలో తెలిపిన ప్రకారం.. ఈ ఘటన యూపీలోని (UP) అమ్రోహా జిల్లా గజ్రౌలాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు కారులో యువతి వద్దకు వెళ్లాడు. ఆమె వద్దకు కేక్ తీసుకెళ్లి తినిపించి, (man proposed love to young woman) ప్రపోజ్ చేయాలని చూస్తాడు.
Traffic Funny Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. లారీని దాటి ముందుకు వెళ్లాలని చూసిన కారు.. చివరకు..
అయితే ఇందుకు ఆమె తిరస్కరిస్తుంది. కేక్ తినకుండా తల పక్కకు తిప్పుకొంటుంది. దీంతో అతను ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురై.. (man threw cake at woman) కేక్ బాక్సును ఆమెపై విసిరికొట్టి, బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీంతో యువతి ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత మనసు మార్చుకున్న అతను.. దగ్గరికి వెళ్లి, తలపై పడిన కేక్‌ను తుడిచేస్తాడు. ఆ తర్వాత కోపంగా కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Gym Viral Video: జిమ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే.. ఖంగుతింటారు..
ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బలవంతంగా ప్రేమను వ్యక్తం చేయడం తప్పు’’.. అంటూ కొందరు, ‘‘ఎదుటి వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 700కి పైగా లైక్‌లు, 48 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 09 , 2025 | 06:40 PM