ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Escalator Funny Video: మనసు మాట మాత్రమే వింటాడేమో.. ఎస్కలేటర్‌పై ఏం చేస్తున్నాడో చూడండి..

ABN, Publish Date - Mar 14 , 2025 | 08:19 PM

టక్ చేసుకున్న ఓ వ్యక్తి నగరంలోని మెట్రో స్టేషన్‌లోకి వచ్చాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఎస్కలేటర్‌పై చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

కొందరు తెలిసి, మరికొందరు తెలీక ఏవేవో పనులు చేస్తూ అందరినీ తెగ నవ్విస్తుంటారు. ఇంకొందరు చదువుకున్నా కూడా టెక్నాలజీలో మాత్రం చాల వెనుకబడి ఉంటారు. ఇలాంటి వారు నగరాల్లోకి వెళ్లిన సందర్భాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎస్కలేటర్‌పై చేసిన నిర్వాకం చూసి అంతా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతను తన మనసు మాట మాత్రమే వింటాడేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టక్ చేసుకున్న ఓ వ్యక్తి నగరంలోని మెట్రో స్టేషన్‌లోకి (Metro station) వచ్చాడు. ఇందులో విశేషమేమీ లేకున్నా.. ఎస్కలేటర్‌పై చోటు చేసుకున్న ఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. చూస్తే చదువుకున్న వాడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి చేతిలో చిన్న సంచి పట్టకుని ఎస్కలేటర్‌పైకి ఎక్కాడు.

Tiger Viral Video: రీల్స్ చూస్తున్న యువకుడు.. మంచం వద్దకు వచ్చిన పులి.. చివరకు చూస్తే..


అయితే పై అంతస్తు నుంచి కిందకు వస్తున్న ఆ వ్యక్తి.. కిందకు వెళ్లేది కాకుండా పైకి వస్తున్న (Escalator) ఎస్కరేటర్ ఎక్కాడు. అయినా ఎలాగోలా కింద వరకూ వచ్చాడు. అయితే ఎస్కలేటర్ దిగే క్రమంలో మాత్రం ఇబ్బంది పడ్డాడు. అతడు కిందకు దిగాలని చూసినా .. ఎస్కలేటర్ పైకి వెళ్తుండడంతో దిగలేక అలా నడుస్తూనే ఉన్నాడు. ఎంత సేపు నడిచినా కూడా ఎస్కలేటర్ నుంచి దిగలేక చాలా సేపు నడుస్తూ అవస్థలు పడ్డాడు.

Theft Funny Video: రాత్రి వేళ కారు వద్దకు వెళ్లిన దొంగలు.. చివరకు దేన్ని ఎత్తుకెళ్లారో చూస్తే.. ఖంగుతింటారు..


దూరం నుంచి అతన్ని గమనించిన వారు ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడికి పెద్ద సమస్యే వచ్చి పడిందే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి ప్రయత్నం ఎన్నటికీ ఫలించదు’’.. అంటూ మరికొందరు, ఫ్ననీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Funny Video: గేదెను కూడా వదల్లేదుగా.. వ్యూస్ కోసం ఈమె చేస్తున్న పని చూడండి..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

Viral Video: టెక్నిక్‌తో పని చేయడమంటే ఇదే.. సిమెంట్ బస్తాలను ఎంత సింపుల్‌గా అన్‌లోడ్ చేస్తున్నాడో చూస్తే..

Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2025 | 08:19 PM