Viral Video: పండుగపూట వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్తున్నారా.. అయితే ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి..
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:54 AM
పర్యాటక ప్రదేశాలను సందర్శించే సమయంలో కొందరు తెలీక, మరికొందరు తెలిసి, ఇంకొందరు అత్యుత్సాహానికి పోయి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి..
పర్యాటక ప్రదేశాలను సందర్శించే సమయంలో కొందరు తెలీక, మరికొందరు తెలిసి, ఇంకొందరు అత్యుత్సాహానికి పోయి లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి వాటర్‌ఫాల్స్ చేసిన నిర్వాకంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవుల సందర్భంగా చాలా మంది వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించడం సర్వసాధారణం. అయితే వాటర్‌ఫాల్స్ వద్దకు వెళ్లే వాళ్లు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడీ జాగ్రత్తలు ఎందుకు చెబుతున్నామంటే.. వావాటర్‌ఫాల్ వద్ద ఓ వ్యక్తి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: రోటీలు తినేముందు ఇది గమనిస్తున్నారా.. ఇతనెలా చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడతారు..
నీటిలో కొందరు స్నానం చేస్తుండగా.. వారిలో ఓ వ్యక్తి మాత్రం రాళ్లపైకి ఎక్కి నీళ్లు కిందకు దూకే స్థలంలోకి వెళ్లాడు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి నీళ్లపై జారుకుంటూ కిందకు వచ్చాడు. అయితే వచ్చే క్రమంలో వేగంగా రావడంతో రాళ్లను ఢీకొట్టుకుంటూ (Man slipped from the top of the waterfall) వచ్చి ధబేల్‌మని నీళ్లలో పడిపోయాడు. ఈ క్రమంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో అతడు స్వల్పగాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
Viral: మిఠాయిలు నమిలిన యువతికి దవడ నొప్పి.. ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా షాకింగ్ సీన్.. చివరకు..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టైం బాగుంది.. లేదంటే ప్రాణాలే పోయేవి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 30.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: భయపెట్టాలని చూశారు.. చివరకు అవాక్కయ్యారు.. పడుకున్న కుక్క పక్కన టపాసు పేల్చడంతో..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 12 , 2025 | 11:55 AM