Share News

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:18 PM

Viral News: భారీ ఊరేగింపు మధ్య శవయాత్ర జరుగుతోంది. పాడిపై పడుకొన్న వ్యక్తి ఒక్కసారిగా లేచి.. కిందకి దూకి పారిపోయాడు.

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..
Seethal-astami

జైపూర్, మార్చి 23: శవయాత్ర అంటే.. ఏవరైనా చనిపోయిన అనంతరం వారిని పాడెపై శ్మశానానికి తీసుకు వెళ్లి.. అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ బతికున్న వ్యక్తిని పాడెపై పొడుకొ పెట్టి.. శ్మశానానికి తీసుకు వెళ్తారా? అంటే ఎవరైనా లేదనే చెబుతారు. కానీ ఈ వింత ఆచారం ఒకటి రాజస్థాన్‌లో బలంగా ఉంది. ఇది గత కొన్ని శతాబ్దాల నుంచి ఆ రాష్ట్రంలో కొనసాగుతోంది. భీల్వాడలో హోలీ పండగ ముగిసిన వారం రోజు అనంతరం బతికున్న వ్యక్తిని పాడెపై పడుకోబెట్టి భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ.. భారీ ఎత్తున సంగీత వాయిద్యాలతో ఈ అంతిమ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు.

డోల్ అని పిలిచే ఈ ఊరేగింపు చిత్తోర్‌గఢ్ భవనం నుంచి ప్రారంభమవుతోంది. ఇది ఊరంతా తిరిగి చివరకు ఓ ఆలయానికి చేరుకొంటుంది. అయితే పాడెపై పడుకున్న వ్యక్తి.. ఈ అంతియ యాత్ర మధ్యలో లేచి కూర్చోవడం, నీళ్లు తాగాడం వంటివి చేస్తాడు. ఇక సదరు ఆలయం వద్దకు ఈ యాత్ర చేరుకోగానే.. పాడెపై పడుకున్న వ్యక్తి.. ఒక్కసారిగా కిందకి దూకి పారిపోతాడు. అనంతరం పాడెను ఆలయం వెనుక దహనం చేస్తారు. ఈ అంతిమ యాత్రను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భీల్వాడకు భారీగా ప్రజలు చేరుకుంటారు.


అలాగే ఈ అంతిమ యాత్రలో పాల్గొనందుకు మహిళలను అనుమతించరు. ఇక ఈ ఊరేగింపులో అసభ్యకరమైన వ్యాఖ్యలు సైతం ప్రజలు చేస్తారు. ఆ క్రమంలో అన్ని కులాలను అవహేళన చేస్తారు. దీనిని ఎవరు చెడుగా భావించక పోవడం గమనార్హం. మరోవైపు ఈ అంతిమ యాత్ర నిర్వహించే ముందు రోజు.. భీల్వాడలోని ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు.


ఆ రోజు రాత్రి నాటక ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తారు. ఈ వింత సంప్రదాయం దాదాపు నాలుగొందల ఏళ్ల నాటి నుంచి కొనసాగుతోందని భీల్వాడ వాసులు వివరిస్తున్నారు. శీతల అష్టమి వేళ.. ఈ తరహా సంప్రదాయం శతాబ్దాల నాటి నుంచి నిర్వహిస్తున్నారని వారు చెప్పారు. సమాజంలో ఏమైనా చెడు లాంటివి ఉంటే.. అవి పోయేందుకు ఈ తరహా యాత్రలు నిర్వహిస్తారని స్థానికులు వివరించారు.

ఇవి కూడా చదవండి..

Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 04:21 PM