Share News

Viral Video: కలికాలం అంటే ఇదేనేమో.. స్కూలు పిల్లల బ్యాగుల్లో ఆ ప్యాకెట్స్

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:12 PM

Nashik Shocker: 7 నుంచి 10 తరగతి విద్యార్థుల బ్యాగులు చెక్ చేయగా షాకింగ్ వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి టీచర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: కలికాలం అంటే ఇదేనేమో.. స్కూలు పిల్లల బ్యాగుల్లో ఆ ప్యాకెట్స్
Nashik Shocker

కలికాలంలో ఉన్నామో... పోయే కాలంలో ఉన్నామో అర్థం కావటం లేదు. సమాజం ఎటు పోతోందో కూడా అర్థం కావటం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు అనికాకుండా.. నేటి బాలలే రేపటి రౌడీలు, గూండాలు అనే పరిస్థితి తలెత్తుతోంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగు చూసిన ఘటనతో దేశ మొత్తం షాక్ అయిపోయింది. 7 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లల బ్యాగుల్లో కత్తులు, కండోమ్స్, ఇతర మారణాయుధాలు వెలుగుచూశాయి. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, నాసిక్‌లోని ఓ స్కూలు యాజమాన్యం.. పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించింది. వారు ఎటువంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా ఉండేలా చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా గత కొద్దిరోజుల నుంచి వారి బ్యాగులను చెక్ చేస్తూ ఉంది.


7 నుంచి 10 తరగతి విద్యార్థుల బ్యాగులు చెక్ చేయగా షాకింగ్ వస్తువులు బయటపడ్డాయి. కత్తులు, కండోమ్స్, గొడవపడ్డానికి వాడే రింగులు, పోకేమాన్ ప్లేయింగ్ కార్డ్స్ బయటపడ్డాయి. స్కూటు యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిల్లల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. ‘ స్కూలు ప్రిన్సిపల్, టీచర్లు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఇది పిల్లలు తప్పుడు దోవలోకి వెళ్లే వయసు. తల్లిదండ్రుల తర్వాత గురువులు మాత్రమే పిల్లలను మంచి మార్గంలో పెట్టగలరు. మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము’ అని అన్నారు. స్కూలు ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ పిల్లల బ్యాగుల్లో అభ్యంతరకరమైన వస్తువులు దొరికాయి. అవన్నీ ఒకే సారి దొరకలేదు. వాటిని చాలా మంది పిల్లల బ్యాగుల్లోంచి తీశాం.


చాలా రోజుల నుంచి దొరుకుతూనే ఉన్నాయి. పిల్లలు క్రిమినల్ పనుల వైపు మళ్లకుండా వారి బ్యాగులను ప్రతీ రోజూ చెక్ చేస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ 1990ల వరకు పిల్లలకు గురువులంటే భయం ఉండేది. గురువులు ఎంత దారుణంగా కొట్టినా.. ఏడ్చి ఊరుకునే వారు. కానీ, ఈ కాలం పిల్లలు అలాకాదు.. తల్లిదండ్రులు కొట్టినా ఒప్పుకోవటం లేదు. గురువులు కొడితే పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. కలికాలం’..‘ స్కూలు పిల్లల బ్యాగుల్లో అలాంటి వస్తువులు ఏంట్రా.. మీరు స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులా.. వీధి రౌడీలా’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం

మా గొడవ మాదే

Updated Date - Apr 09 , 2025 | 01:37 PM