Professional Job Exit: ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో చేయకూడని మిస్టేక్స్
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:36 PM
ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో చేయకూడని మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వివిధ కారణాలతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి రావచ్చు. ఈ క్రమంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడని కెరీర్ ఎక్స్‌పర్టులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేయకూడదు. సంస్థకు నోటీ ఇచ్చాకే తప్పుకోవాలి. ఈ సంధి కాలంలో వీలైనంత మర్యాదగా ఉండాలి.
భావోద్వేగాలకు లోనై ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పడం స్సలు కరెక్ట్ కాదు. పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి.
ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో కంపెనీ శాలరీ పెంచితే రాజీపడి జాబ్‌లో కొనసాగొద్దు. అసలు సంస్థను వీడాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ఓసారి ఆలోచించాలి. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి.
నోటీస్ పీరియడ్‌లో ఉన్నంత మాత్రాన పనిపట్ల నిరాసక్తత వద్దు. మిగిలిపోయిన బాధ్యతలన్నీ పూర్తి చేసి మరీ సంస్థను వీడాలి.
సంస్థను వీడే సమయంలో నిబంధనలను అస్సలు ఉల్లంఘించొద్దు. అనుమతి లేని పత్రాలను కాపీ చేసి పెట్టుకోవడం, నాన్ కంపీట్ నిబంధనలను ఉల్లంఘించి పోటీదారులతో చేరడం వంటివి చేయొద్దు.
ఓ సంస్థను వీడేటప్పుడు అసహనాన్ని, అసంతృప్తిని తోటి ఉద్యోగులపై తీర్చుకోవద్దు. వారితో స్నేహ బంధాన్ని తెంచుకుని వెళ్లొద్దు. హుందాగా పక్కకు తప్పుకోవాలి.
సంస్థ క్లైంట్‌లకు, పార్టనర్‌లకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలకాలి. చెప్పాపెట్టకుండా మాయమైపోకూడదు. అందరినీ కలుసుకుని గుడ్ బై చెప్పి మరీ వెళ్లాలి.
మిగిలి పోయిన పనులు ఏమైనా ఉంటే సహోద్యోగుల మీద నెట్టేసి వెళ్లకూడదు. ఆయా పనులను వీలైనంత వరకూ పూర్తి చేసి మిగతా పనులను తగిన వారికి అప్పగించి వెళ్లాలి.
ఉద్యోగాన్ని వీడటం కష్టమైన పనే కానీ వ్యవహారం నానా రభసగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్న విషయం మర్చిపోకూడదు.
ఇవి కూడా చదవండి:
17 డాక్టర్లకు సాధ్యం కానిది చేసి చూపించిన చాట్ జీపీటీ
యువత ఇలా తయ్యారయ్యారేంటి.. ముఖంపై పింపుల్ వచ్చిందని ఉద్యోగానికి గుడ్‌బై
సైబర్ నేరగాళ్లను ఎలా బురిడీ కొట్టించాలో ఈ బాలికను చూసి నేర్చుకోవాలి