సంస్కారం అనే పదం ఎలా వచ్చిందో తెలుసా.. దానికి నిజమైన అర్థం ఇదే
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:03 PM
గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడ ఇలా ఇవ్వన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తి సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటారు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి, ఈ పదం ఎలా వచ్చింది.

వీడు చాలా సంస్కార వంతుడు, వీడెవడ్రా బాబు అసలు సంస్కారం లేనోడిలా ఉన్నాడనే మాటలు తరచూ వింటుంటాం. సాధారణంగా బుద్ధిగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులను సంస్కారవంతులుగా పిలుస్తారు. చాలామది వాడు పెద్ద పెద్ద చదవులు చదవకపోయినా పర్వాలేదు. సంస్కారం కలిగి ఉంటే చాలంటుంటారు. ఏ వస్తువునైనా కొనుక్కోవచ్చు కానీ సంస్కరాన్ని మాత్రం కొనుక్కోలేము.
గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడ ఇలా ఇవ్వన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తి సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటారు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి, ఈ పదం ఎలా వచ్చిందనేది కొంతమందికి తెలిసుండొచ్చు.మరికొంతమందికి తెలియకపోవచ్చు. అసలు సంస్కారం అనే పదం వెనుక ఉన్న మతలబు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సంస్కారం అనేది సంస్కృత పదం. సమ్ + కార అనే సంస్కృత పదం నుంచి సంస్కారం అనే పదం ఉద్భవించింది. సం అంటే పరిపూర్ణం, కార అంటే చేయడం అంటే పరిశుద్ధం, మెరుగైన, పరిపూర్ణమైన అనే అర్థాలు వస్తాయి. ఈ పదం ఒక వ్యక్తి యొక్క మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక జీవనాన్ని శుద్ధి చేసే, ఉన్నతం చేసే లక్షణాలను సూచిస్తుంది. ఈ పదాన్ని రెండు రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఆచారపరమైన సంస్కారాలు, వ్యక్తిగత గుణాలను తెలియజేసే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
ఆచార వ్యవహారాల్లో
హిందూ సంప్రదాయంలో జననం నుంచి మరణం వరకు జీవితంలో నిర్వహించే కీలక దశలను ఆచారపరమైన సంస్కారాలుగా పిలుస్తారు. ముఖ్యగా పట్టిన తరవాత నామకరణం, ఉపనయనం, వివాహం వంటి వాటిని ఆచారపరమైన సంస్కారాలుగా పేర్కొంటారు. కానీ మనం తరచూ వ్యక్తిగత గుణాలను తెలియజేసేటప్పుడు ఈ పదాన్ని విరివిగా ఉపయోగించడాన్ని చూస్తుంటాం. ఒక వ్యక్తి యొక్క నీతి, సంస్కృతి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాల ఆధారంగా సంస్కారవంతుడా కాదా అని అంచనా వేస్తుంటారు. భారతీయ సమాజంలో ఎక్కువుగా ఈ పదాన్ని ఉపయోగించడానికి కారణం వ్యకతి యొక్క జీవన విధానాన్ని, సొసైటీతో అతడి సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతిలో ఒక వ్యక్తి సంస్కారవంతుడని చెప్పడం ద్వారా అతడు నీతివంతుడని, అలాగే ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి అని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడని తెలియజేయడానికి సంకేతంగానూ ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
ఈ పదం ఎలా వచ్చింది
సంస్కృత భాష నుంచి ఉద్భవించిన ఈ పదం వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాల వంటి పురాన గ్రంథాల్లో ఈ పదాన్ని విస్తృతంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. గృహ్యసూత్రాలు, మనుస్మృతి వంటి గ్రంథాల్లో సంస్కారాలను జీవిత దశలను శుద్ధిచేసే ఆచారాలుగా పేర్కొన్నారు. ముఖ్యగా 16 సంస్కారాలు హిందూ జీవన విధానంలో కీలకమైనవిగా చెబుతారు.
ఇవి కూడా చదవండి:
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
మరికొన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here