Share News

Viral Video: ఫ్రిడ్జ్ వాటర్ కదా అని తాగేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే వాంతులు చేసుకుంటారు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:25 PM

ఓ ఆఫీసులో నీళ్ల ఫ్రిడ్జ్ ఎలా అపరిశుభ్రమైందో చూసి అంతా అవాక్కవుతున్నారు. చూసేందుకు ఎంతో శుభ్రంగా ఉన్నా కూడా నీళ్లు తాగే ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..

Viral Video: ఫ్రిడ్జ్ వాటర్ కదా అని తాగేస్తున్నారా.. ఈ వీడియో చూస్తే వాంతులు చేసుకుంటారు..

దాహం వేసినప్పుడు నీళ్లు కనిపిస్తే ముందు వెనుకా ఆలోచించకుండగా గటగటా తాగేస్తుంటాం. అవి పరిశుభ్రమైనవా లేదా అని కూడా ఆలోచించం. కొన్నిసార్లు మన కంటికి శుభ్రంగా కనిపిస్తున్నా కూడా నిశితంగా పరిశీలిస్తే అందులో అనేక రకాల క్రిములు దాగి ఉంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనం ఊహించని విధంగా ఆ నీరు లేదా ఆ ప్రాంతం అపరిశుభ్రం అవుతుంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. చూసేందుకు శుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్.. ఎలా అపరిశుభ్రమైందో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఆఫీసులో నీళ్ల ఫ్రిడ్జ్ ఎలా అపరిశుభ్రమైందో చూసి అంతా అవాక్కవుతున్నారు. చూసేందుకు ఎంతో శుభ్రంగా ఉన్నా కూడా నీళ్లు తాగే ప్రాంతం అపరిశుభ్రంగా మారింది. ఓ పెద్ద ఎలుక ఆఫీసులోకి వచ్చి నేరుగా ఫ్రిడ్జ్ పైకి ఎక్కేసింది. ట్యాప్ వద్ద నోరు పెట్టి మరీ నీరు తాగేసింది.

Viral Video: ఫోన్‌తో ఫొటోలు తీసుకుంటున్న వ్యక్తి.. సమీపానికి వెళ్లిన యువతి.. గ్యాలరీలో చూడగా..


ఇలా దాహం తీర్చుకున్న తర్వాత (mouse drinking water from the fridge).. తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో చూసిన తర్వాత అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Gas Stove Funny Video: గ్యాస్ స్టవ్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..


‘‘వామ్మో.. ఇకపై ఆఫీసుల్లో నీరు తాగాలంటే ఆలోచించాల్సిందే’’.., ‘‘అందుకే నేను ఆఫీసుకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటాను’’.., ‘‘ఎలుక ఇలా ఫ్రిడ్జ్‌ను పాడుచేస్తుందని కలలో కూడా ఊహించలేదు’’.., ‘‘ఈ నీటిని తాగితే రోగాలు రావడం పక్కా’’.., ‘‘మూగజీవుల కోసం నీటిని అందుబాటులో ఉంచితే ఇలా జరిగే అవకాశం ఉండదు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లు, 4.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 01:25 PM