Elephants Viral Video: భయానక భూకంపం.. భయంతో ఏనుగుల పరుగులు
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:31 AM
Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు తరచుగా వస్తూ ఉన్నాయి. గత నెలలో ఒకే రోజు రెండు భూకంపాలు రావటంతో మయన్మార్ శవాల దిబ్బగా మారిపోయింది. వేల మంది చనిపోవటంతో పాటు లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఆ తర్వాత జపాన్, పాకిస్తాన్‌లో కూడా భూకంపాలు వచ్చాయి. ఆ భూకంపాల తీవ్రత తక్కువగా ఉండింది. ఇక, సోమవారం ఉదయం అమెరికాలోని శాండీయాగోలో భూకంపం వచ్చింది. ఆ భూకంపం తీవ్రత రెక్టార్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఉదయం 10.10 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. సరిగ్గా గంట తర్వాత లాస్ ఏంజిల్స్, తిజువానా, మెక్సికోలలో భూకంపం వచ్చింది.
భూకంపం కారణంగా జనంతో పాటు మూగ జీవాలు కూడా భయంతో గజగజలాడాయి. జూలోని ఏనుగులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాండీయాగోలో భూకంపం వచ్చిన సమయంలో అక్కడి జూ సఫారీ పార్క్‌లోని ఆఫ్రికన్ ఏనుగులు భయపడ్డాయి. ప్రాణ భయంతో అటు, ఇటు పరుగులు తీశాయి. భూమి కంపించటం ఆగిపోయిన తర్వాత అన్నీ ఒక చోటుకు వచ్చాయి. ప్రమాదం ఎక్కడినుంచి వస్తుందోనని గుంపుగా చేరాయి. ఒక్కో ఏనుగు .. ఒక్కో వైపు తిరిగి నిల్చున్నాయి. ప్రమాదం ఏమీ లేదని తెలిసిన తర్వాత అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయాయి.
వీడియోలోని ఆ ఏనుగుల పేర్లు.. న్యాడుల, ఉంగణి, కోసి, జూలి, మైకాలుగా తెలుస్తోంది. సాధారణంగా మనుషులు భూకంపాలు రావటాన్ని గుర్తించలేరు. కానీ, జంతువులకు మాత్రం ముందుగానే తెలిసిపోతుంది. అవి అలర్ట్ అయిపోతాయి. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. అడవుల్లో భూకంపాలు వచ్చినా జంతువులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. జనావాసాల్లో ఉంటేనే తీవ్ర నష్టం కలుగుతుంది. భూకంపం రాగానే ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి. వాటికింద పడి 90 శాతం మంది చనిపోతూ ఉంటారు.
ఇవి కూడా చదవండి
Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు
Honeytrap: రూ.13 వేల కోట్ల స్కాం.. మెహుల్ చోక్సీ హనీట్రాప్ నిజమా.. కాదా..