ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పైప్‌లైన్ నుంచి వింత శబ్ధాలు.. ఏముందా అని కట్ చేసి చూడగా.. గుండెల్ని పిండేసే సీన్..

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:50 AM

పైప్‌లైన్ నుంచి వింత వింత శబ్ధాలు వస్తుండడంతో స్థానికులు గుమికూడారు. పైపు నుంచి శబ్ధాలు రావడంతో ఆశ్చర్యపోయిన వారు.. చిరవకు అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

తల్లి ప్రేమకు సాటి మరేదీ లేదనేది అక్షర సత్యం. అయితే కొందరు మాత్రం తల్లి అనే పవిత్ర స్థానానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ప్రేమ వ్యవహారాల కారణంగా కొందరు, వివాహేతర సంబంధాల కారణంగా ఇంకొందరు గర్భం దాల్చడం, తమ పరువు పోకుండా ఉండేందుకు అబార్షన్‌లు చేయించడం సర్వసాధారణమైంది. కొందరైతే పుట్టిన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా చెత్తకుప్పల్లో విసిరేయడం చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి హృదయ విదారక సంఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పైప్‌లైన్ నుంచి శబ్ధాలు వస్తుండడంతో అనుమానం వచ్చింది. అందులో ఏముందా.. అని చివరకు పైపును కోసి చూడగా గుండెల్ని పిండేసే సీన్ కనిపించింది..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పైప్‌లైన్ నుంచి వింత వింత శబ్ధాలు (Strange noises from pipeline) వస్తుండడంతో స్థానికులు గుమికూడారు. పైపు నుంచి శబ్ధాలు రావడంతో ఆశ్చర్యపోయిన వారు.. చిరవకు అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

Viral Jugadh: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. నీళ్ల క్యాన్‌ను ఎలా సెట్ చేశారో చూడండి..


సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుని, శబ్దం వస్తున్న ప్రాంతంలో పైపును ఎంతో జాగ్రత్తగా కట్ చేశారు. తీరా కట్ చేసి చూడగా.. (newborn baby in pipeline) అందులో నవజాత శిశువు ఏడుస్తూ కనిపించింది. ఎవరూ ఊహించని విధంగా పైపులో శిశువును చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శిశువుకు బొడ్డు తాడును కూడా కత్తించకుండా పైపులో పడేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. అక్రమంగా గర్భం దాల్చిన మహిళ.. ఇలాంటి దారుణమైన పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

Elephants Viral Video: స్నేహమంటే ఇదేరా.. చనిపోయిన ఏనుగు పక్కన ఏం చేస్తుందో చూస్తే..


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తాత్కాలిక సుఖాల కోసం అడ్డదారులు తొక్కడం, చివరకు ఇలా కర్కశంగా ప్రవర్తించడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘పైపులో పడేసినా పిల్లాడు ప్రాణాలతో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8.96 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..


ఇవి కూడా చదవండి..

Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..

Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..

Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 17 , 2025 | 11:51 AM