Viral Video: ఈ కుర్రాడి స్పీడ్‌ను చూసి మిక్సీ కంపెనీలు కూడా భయపడతాయేమో.. వీడియో చూస్తే థ్రిల్ కావాల్సిందే..
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:28 PM
రోజూ ఒకే పనిని చేసే వ్యక్తి ఆ పనిలో మాస్టర్ అయిపోతాడు. అనుభవంతో నిపుణుడిగా మారిపోతాడు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని కుర్రాడు ఉల్లిపాయలను కోయడంలో అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

చాలా సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణమైన ప్రతిభను (Talent) కనబరుస్తుంటారు. రెగ్యులర్‌గా చేసే పనినే తమదైన శైలిలో వినూత్నంగా చేసేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రోజూ ఒకే పనిని చేసే వ్యక్తి ఆ పనిలో మాస్టర్ అయిపోతాడు. అనుభవంతో నిపుణుడిగా మారిపోతాడు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని కుర్రాడు ఉల్లిపాయలను కోయడంలో అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు (Cutting onions). ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది (Viral Video).
just_crazy_thingss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు ఉల్లిపాయలను అతి వేగంగా కట్ చేస్తున్నాడు. ఉల్లిపాయ వైపు కనీసం చూడకుండా అతి వేగంగా చాకుతో కోస్తున్నాడు. చేతిని అతి వేగంగా కదిలిస్తూ సెకెన్ల వ్యవధిలో ఉల్లిపాయలను అతి చిన్న ముక్కలుగా కోసేస్తున్నాడు. అతడి ప్రతిభను ఓ వ్యక్తి కేమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలోని కుర్రాడి ప్రతిభను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మిక్సీ కంటే వేగంగా పని చేస్తున్నాడు``, ``ఇతను మనిషి రూపంలో ఉన్న మెషిన్``, ``మనం అలా కట్ చేయడానికి ప్రయత్నిస్తే వేళ్లు తెగిపోవడం ఖాయం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: నా పాపాలే కాదు.. నా మొబైల్ పాపాలు కూడా పోవాలి.. కుంభమేళాలో ఓ కుర్రాడు ఏం చేశాడంటే..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..