Share News

Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు మరో కుట్ర.. ఈ సారి కారు టార్గెట్...

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:14 PM

Salman Khan News: గత కొన్నేళ్ల నుంచి సల్మాన్ ఖాన్ ఒకరకంగా కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తరచుగా మరణ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు.

Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు మరో కుట్ర.. ఈ సారి కారు టార్గెట్...
Salman Khan News

కృష్ణ జింకలను చంపిన తర్వాతి నుంచి సల్మాన్ ఖాన్ జీవితం పూర్తిగా మారిపోయింది. గత నాలుగైదు ఏళ్లనుంచి ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్టోయ్ కారణంగా ఇప్పటికే చాలా సార్లు చావునుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఈ నేపథ్యంలోనే మరణ భయంతో సెక్యూరిటీ టైట్ చేశారు. ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నారు. ఎక్కడికెళ్లినా బుల్లెట్ ప్రూఫ్ కారులోనే వెళుతున్నారు. అయినా కూడా ఆయనకు వేధింపులు తప్పటం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా ఆయన్ని చంపుతామంటూ బెదిరిస్తూ ఉన్నారు. తాజాగా కూడా ఆయనకు బెదిరింపులు వచ్చాయి.


గుర్తు తెలియని వ్యక్తి ఆయన కారును బాంబుతో పేల్చి పడేస్తానంటూ వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. బాంద్రాలోని ఇంటి దగ్గరే ఆయన్ని చంపేస్తానంటూ హెచ్చరించాడు. సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులకు పాల్పడ్డ ఆ వ్యక్తిపై వోర్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అతడు ఎవరు అన్న విషయం తెలుసుకోవడానికి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ వ్యక్తి లారెన్స్ బిష్టోయ్ గ్యాంగుకు చెందిన వాడై ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది. ఇక, 2024, ఏప్రిల్ నెలలో బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది. బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ గేటు దగ్గర తుపాకులతో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు.


5 కోట్ల డిమాండ్

సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు సల్మాన్ ఖాన్‌కు పలు కీలక సూచనలు చేసింది. ‘ నిన్ను చంపాకుండా ఉండాలంటే.. ఏదైనా గుడికి వెళ్లి దేవుడ్ని ప్రార్థించు. ప్రజలందరి ముందు క్షమాపణ చెప్పు. 5 కోట్ల రూపాయలు మాకు పంపు’ అని అంది. సల్మాన్ ఖాన్ ఈ సూచనలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరో సారి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. తరచుగా ఎదురవుతున్న బెదిరింపులపై సల్మాన్ తాజాగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ దేవుడు.. అల్లా అందరూ పైన ఉన్నారు. నేను ఎన్నాళ్లు బతకాలని ఉంటే అన్నాళ్లు బతుకుతాను. అంతకంటే ఏంలేదు. దేవుడంతా చూస్తూ ఉన్నాడు. రాసి పెట్టినంత కాలం నేను బతుకుతాను’ అని అన్నారు.

Updated Date - Apr 14 , 2025 | 12:28 PM