iPad Theft - Woman Arrest: ఇలాగైతే పిల్లల్ని పెంచడం కష్టమే.. కూతుళ్లకు క్రమశిక్షణ నేర్పిద్దామనుకుంటే..
ABN , Publish Date - Apr 13 , 2025 | 07:47 PM
కూతుళ్లను క్రమశిక్షణలో పెట్టబోయిన ఓ తల్లికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఐప్యాడ్ చోరీ కేసుపై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్ని పెంచడం సామాన్య విషయం కాదు. ఒక్కోసారి వారితో కాస్త కటువుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే, పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇలాంటి సందర్భాల్లో కఠిన నిబంధనలు ఉంటాయి. తల్లిదండ్రులు ఏమాత్రం తప్పుగా ప్రవర్తించాలని తేలినా వెంటనే కేసులు పెట్టేస్తారు. బ్రిటన్‌లో సరిగ్గా ఇదే జరిగింది. పోలీసులు అతి చేష్టకు ఓ మహిళ అనవసరంగా అస్థల పాలైంది.
సర్రీ ప్రాంతానికి చెందిన వెన్నెసా బ్రౌన్ ఓ హిస్టర్ టీచర్, ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. నిత్యం స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్‌లు అంటూ ప్రపంచాన్ని పట్టించుకోకుండా గడుపుతున్న వారిని క్రమశిక్షణలో పెట్టాలని తల్లి భావించింది. వారి వద్ద ఉన్న ఐప్యాడ్స్‌ను తీసుకుని తన తల్లి (80) ఇంటికి వెళ్లింది. ఈలోపు వెనెస్సా ఇంటి నుంచి పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. తమ ఇంట్లో ఐప్యాడ్స్ పోయాయంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ట్రాకింగ్ డివైజ్ సాయంతో ఐప్యాడ్స్ జాడ కనిపెట్టారు. వెన్నెసా తల్లి ఇంట్లోనే అవి ఉన్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలో వెన్నెసా తల్లి ఇంటికి వెళ్లిన వారు మహిళలను ఐప్యాడ్స్ గురించి పలు ప్రశ్నలు సంధించారు. ఆమె తల్లితో కూడా కాస్త కటువుగానే ప్రవర్తించారు. ఐప్యాడ్స్ తిరిగి ఇచ్చేయమని వెన్నెసాను అడిగారు. కానీ ఆమె మాత్రం తిరస్కరించింది. దీంతో, వెన్నెసాను అరెస్టు చేశారు. ఆ తరువాత కొన్ని గంటల పాటు ఆమెను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి ఆ తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. ఇది చాలా దారుణ అనుభవమని వెన్నెసా పోలీసులపై మండిపడింది. ‘‘అసలు నన్ను అరెస్టు చేయాలని ఎందుకనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు’’ అని వాపోయింది. వృద్ధురాలైన తన తల్లితో కూడా క్రిమినల్‌తో వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కటువుగా మాట్లాడారని వెన్నెసా వాపోయింది.
అయితే, ఆ ఐప్యాడ్స్ వెన్నెసా కూతుళ్లవని గుర్తించిన పోలీసులు మరుసటి రోజే యూటర్న్ తీసుకున్నారు. వెన్నెసాపై పెట్టిన కేసులన్నీ మూసేశారు. దీనిపై ఇక ఎటువంటి దర్యాప్తు ఉండబోదని కూడా వ్యవహరించారు. కానీ, పోలీసులపై వెన్నెసా ఆగ్రహం మాత్రం చల్లారలేదు. జనాలు కూడా పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
యువతి వింత హాబీ.. చచ్చిన దోమల్ని పేపర్‌పై అతికించి
మహిళకు షాక్.. ఆఫీసు టైమ్ కంటే నిమిషం ముందుగా ఇంటికెళ్లినందుకు..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..