Business Idea: ఇలా చేస్తే.. సొంతూళ్లోనే నెలకి రూ.50 వేలు సంపాదన..
ABN, Publish Date - Jan 18 , 2025 | 11:41 AM
తక్కువ పెట్టుబడితో సొంతూళ్లోనే మంచి సంపాదన పొందాలని కోరుకునేవారికి బంపర్ ఆఫర్. ఈ ఐడియా ఫాలో అయ్యారంటే ఈజీగా నెలకు రూ.50వేలు సంపాదించేయగలరు. అదేంటో తెలుసుకోండి..

Business Idea: చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊళ్లో చదివిన చదువుకు ఉద్యోగం రాదు. ఇంట్లో వాళ్లను వదిలి వెళ్లేందుకు మనసు రాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సిటీల్లో వాలిపోతుంటారు యువత. మంచి శాలరీతో జాబ్ దొరికినా ఉరుకుల పరుగుల జీవితంతో ఏదో కోల్పోయామనే భావన చాలామందిలో ఉంటుంది. హోం సిక్ ఫీలింగ్ పట్టి పీడిస్తూ ఉంటుంది. పోనీ ఉద్యోగం వదిలేసి హాయిగా సొంతూరికి వెళ్లిపోదాం అనుకున్నా సంపాదన లేకపోతే ఎలా అనే ప్రశ్న మదిలో తలెత్తుతుంది. తగినంత పెట్టుబడి ఉండి ఉన్న ఊళ్లో వ్యాపారం చేసుకుందాం అనుకునేవారికి ఐడియా ఉండకపోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే స్వంత వ్యాపారం చేస్తూ టెన్షన్‌లకు దూరంగా, ప్రశాంతతకు దగ్గరగా ఉండాలని కోరుకునే వారూ ఎందరో. లాస్ రాకుండా బిజినెస్ చేయాలనుకునేవారూ ఇలా చేశారంటే నెలకు లక్షల్లో సంపాదించాలనే మీ కల సాకారం చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇదే..
నష్టపోకుండా మంచి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా.. అయితే, ఇది మీ కోసమే. ఇలా చేస్తే చాలా తక్కువ పెట్టుబడితో నెలకు మినిమం రూ.50వేల సంపాదన చేతికొస్తుంది. జెనరిక్ మెడిసిన్ స్టార్టప్ కంపెనీ జెనెరిక్ ఆధార్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా సొంతూళ్లోనే ఉంటూ ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎలాంటి సంకోచం లేకుండా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకంటే, ఇది . రతన్ టాటా పెట్టుబడి పెట్టిన కంపెనీ. ఈ ఫార్మసీ స్టార్టప్ ఫ్రాంచైజీని పొందినవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎక్కడైనా వ్యాపారం చేసుకోని మంచి ఆదాయం ఆర్జించవచ్చు.
జెనరిక్ ఆధార్ ఫార్మసీ స్టార్టప్‌కు రతన్ టాటా సాయం:
అర్జున్ దేశ్‌పాండే అనే ఔత్సాహిక యువకుడు మహారాష్ట్రలోని పూణెలో జనరిక్ ఆధార్ కంపెనీని మొదలుపెట్టాడు. సాధారణ పెద్ద ఫార్మసీ కంపెనీలు దుకాణదారులకు గరిష్ఠంగా 15-20 శాతం మార్జిన్ మాత్రమే ఇస్తాయి. జనరిక్ ఆధార్ కంపెనీ అయితే దాదాపు 40 శాతం వరకూ మార్జిన్ ఇస్తుంది. అదే విధంగా వినియోగదారులకూ ఔషధాలపై 80 శాతం వరకూ తగ్గింపు ఇస్తుంది. ఇందులో కస్టమర్లకు 1000 రకాల జనరిక్ మందులు లభ్యమవుతాయి. కొత్తగా స్టోర్ మొదలుపెట్టాలనుకునే వారితో పాటు ఇదివరకే సొంతంగా మెడికల్ స్టోర్ నడుపుతున్న వారు కూడా జనరిక్ ఆధార్ కంపెనీతో డీల్ కుదుర్చుకోవచ్చు. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటూనే ఫ్రాంచైజీల ద్వారా ఉపాధి అందిస్తోంది కాబట్టే, రతన్ టాటా కూడా అర్జున్ ఆలోచనకు మెచ్చి ఈ స్టార్టప్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ జనరిక్ ఆధార్ కంపెనీకి దేశంలోని 18 రాష్ట్రాల్లోని 130కి పైగా నగరాల్లో ఫ్రాంచైజీలు ఉన్నాయి.
ఫ్రాంచైజీ పొందండి ఇలా..
ఆసక్తి ఉన్నావారు ముందుగా జనరిక్ ఆధార్ కంపెనీ వెబ్‌సైట్ genericaadhaar.com/ని సందర్శించండి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీపై క్లిక్ చేయగానే.. స్క్రీన్‌పై ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ తదితర వ్యక్తిగత వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే చాలు. ఇప్పటికే సొంత మెడికల్ షాపు నిర్వహించే వారైనా ఆధార్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రాంచైజీ దక్కించుకున్న వారికి కంపెనీ GA (జనరిక్ ఆధార్) బ్రాండ్ లోగో ఇస్తుంది. ఇంకా బ్రాండింగ్ మెటీరియల్స్, ఫార్మాస్యూటికల్ ప్రక్రియల కోసం ఇంటర్నల్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందుకు డ్రగ్స్ లైసెన్స్ కచ్చితంగా పొంది ఉండాలి.
Updated Date - Jan 18 , 2025 | 11:50 AM