Share News

81 Year Old Wins Lottery: లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:59 PM

81 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. పుట్టిన రోజు నాడు ఆయనకు లాటరీలో ఏకంగా కోటికి పైగా డబ్బు ముట్టింది.

81 Year Old Wins Lottery: లక్ అంటే ఇదీ.. లాటరీలో రూ.43 లక్షల.. ఆపై మరో 86 లక్షల గెలుపు
81 Year Old Wins Lottery in USA

ఇంటర్నెట్ డెస్క్: లక్ ఎప్పుడు తలుపుతడుతుందో చెప్పడం కష్టం. కాలం కలిసొచ్చిదంటే మాత్రం ఇక తిరుగే ఉండదు. అమెరికాకు చెందిన ఓ 81 ఏళ్ల వ్యక్తి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. జీవిత చరమాకంలో అతడు ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. తన అదృష్టాన్ని చూసి తనే నమ్మలేని స్థితికి చేరుకున్నాడు.

నార్త్‌కెరోలీనాకు చెందిన వృద్ధుడు డెన్నిస్ పార్క్‌కు ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా లాటరీలో భారీగా ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. మొదట్లో కొన్న లాటరీకి రూ.43 లక్షల గెలుచుకోగా అదే రోజు కొన్న రెండో లాటరీ టిక్కెట్టుకు ఏకంగా రెండింతల ప్రైజ్ మనీ దక్కింది. దీంతో, డెన్నిస్ ఆనందానికి అంతే లేకుండా పోయింది.

ఆ రోజు తనకు నిజంగా కాలం కలిసొచ్చిందని డెన్నిస్ మురిపోతూ చెప్పాడు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా కూతురితో కలిసి గ్రీన్స్‌బోరో రీజినల్ ఆఫీసుకు రూ.43 లక్షల లాటరీ డబ్బు తీసుకునేందుకు వెళ్లినట్టు తెలిపాడు.


ఇదే క్రమంలో తన కూతురు మరో లాటరీ టిక్కెట్టు కొని గిఫ్ట్‌గా ఇచ్చిందన్నారు. తీరా చూస్తే ఆ టిక్కెట్టుపై మరో రూ.83 లక్షలు వచ్చాయని మురిసిపోయాడు. ఇంత భారీగా డబ్బు గెలుచుకోవడంతో డెన్నిస్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల్లో కూడా నోరెళ్లబెట్టారు. ఈ డబ్బుతో తన కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతానని అతడు చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నార్త్‌కెరోలీనాకు చెందిన మరో వ్యక్తి రాబర్ట్ హోబన్ లాటరీపై ఏకంగా రూ.95 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందు వచ్చిన ఓ కల చివరకు ఇలా నిజమైందని చెప్పుకొచ్చాడు. తనకు కలలో కనిపించిన మొత్తమే గెలుచుకున్నానని చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయం చెబితే మొదట్లో తన కుటుంబసభ్యులు కూడా నమ్మలేకపోయినట్టు పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే.. 2022లో అమెరికాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో పవర్ బాల్ లాటరీలో ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. ప్రపంచంలో అత్యధిక లాటరీ మొత్తంగా ఇది రికార్డుకెక్కింది. అయితే, ఒకేసారి లాటరీ సొమ్ము తీసుకునేందుకు అతడు సిద్ధపడటంతో 997.6 మిలియన్ల డబ్బు మాత్రమే చేతికందింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ తరువాత అతడు పన్నుగా కూడా చెల్లించాడు.

ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..

దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు

Read Latest and Viral News

Updated Date - Apr 11 , 2025 | 05:59 PM