Dishwashers In India: మన దేశంలో అంట్లు తోమే డిష్ వాషర్లు ఎందుకు పాప్యులర్ కాదంటే..
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:29 PM
భారత్‌లో డిష్ వాషర్లు పాప్యులర్ ఎందుకు కాదంటూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్న నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. జనాలు దీనికి రకరకాల సమాధానాలు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: నెట్టింట ఆస్తికరమైన చర్చలకు కొదవే లేదు. జనాలు తమ మనసులో మాటను నెట్టింట పంచుకోవడం, దానిపై ఇతరులు పెద్ద ఎత్తున స్పందించడం చాలా కామన్. అయితే, కొన్ని చర్చలు వేల మంది దృష్టిని ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి. ప్రస్తుతం డిష్ వాషర్‌పై చర్చ ఇదే విధంగా పతాకస్థాయికి చేరుకుంది.
పాశ్చాత్య జీవనంలో భాగమైన అనేక అంశాలు ప్రపంచమంతటా ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్ ఆ కోవలేక వస్తాయి. ఇక దుస్తులు ఉతుక్కునేందుకు అనేక మది వాషింగ్ మెషీన్లను వాడుతున్నారు. అయితే, అంట్లు తోమేందుకు ఉపయోగపడే డిష్‌వాషర్లు మాత్రం ఈ స్థాయిలో పాప్యులర్ కాలేదనే చెప్పాలి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నెట్టింట సరిగ్గా ఇదే ప్రశ్న వేశాడు.
దేశంలో డిష్ వాషర్లు ఎందుకు పాప్యులర్ కాలేదో ఎవరికైనా తెలిస్తే చెప్పాలంటూ కుతూహలం కొద్దీ అడిగాడు. దీంతో, మొదలైన చర్చ క్రమంగా అనేక మందిని ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
డిష్ వాషర్లపై భారతీయులు ఆసక్తి కనబరచకపోవడానికి పలు కారణాలను నెటిజన్లు ప్రస్తావించారు. ఈ ఉపకరణాలు చాలా ఖరీదైనవని కొందరు అన్నారు. నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువేనని తెలిపారు. భారతీయ వంటగదుల్లో జాగా తక్కువగా ఉంటుందని, డిష్ వాషర్లు పట్టవని కొందరు అన్నారు. డిష్ వాషర్లో పెట్టు ముందు గిన్నెలను ముందుగా ఓసారి కడగాల్సిన అవసరం కూడా ఉంటుందని కొందరు చెప్పుకొచ్చారు.
సహాయకులను నియమించుకుంటే ఇంత కంటే తక్కువ ఖర్చులోనే పని పూర్తవుతుందని చెప్పారు. అసలు భారతీయులు వాడే గిన్నెలు వంటివాటికి డిష్ వాషర్లు సరిపోవని కూడా కొందరు తెలిపారు. భారతీ వంటల్లో కనిపించే నూనెలు వంటి వాటిని తొలగించడం డిష్ వాషర్లు సాధ్యం కాదని తెలిపారు. కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడంలో అనేక మంది భారతీయులకు సంశయం ఎక్కువని, వెనుకంజ వేస్తారని కూడా అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
ఏఐ ఎఫెక్ట్.. నెలకు రూ.1.5 లక్షలు ఆర్జిస్తున్న పదో తరగతి కుర్రాడు
ఈ బాస్ నిజంగా గ్రేట్.. 70 ఉద్యోగులను తీసేశాక..
కొత్తగా పెళ్లైన వాళ్లు ఫాలో కావాల్సిన ఆర్థిక సూత్రాలు