లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.
ABN , Publish Date - Apr 14 , 2025 | 08:57 AM
Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.

Relationship News: ఈ మధ్య కాలంలో ప్రేమ బంధాలు చాలా దారుణంగా తయారయ్యాయి. కొంతమంది అవసరాల కోసం మాత్రమే ప్రేమలు నటిస్తున్నారు. అవసరం తీరిపోగానే వదిలేస్తున్నారు. ఆడ,మగ ఇద్దరూ అలానే ఉన్నారు. ఒకప్పుడు దశాబ్దాల పాటు ప్రేమికులు కలిసి ఉంటే.. ఇప్పుడు మాత్రం.. నెలలు, రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. రెండు, మూడు సంవత్సరాలు కలిసి ఉంటే అదో పెద్ద అచీవ్‌మెంట్. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళితే.. అదో పెద్ద సాహసం అని చెప్పాలి. అంటే.. నిజమైన ప్రేమికులు.. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేవారు లేరని కాదు.. అలాంటి జంట నూటికో.. కోటికో ఓ జంట కనిపిస్తోంది.
ప్రేమ జంటల బలహీనతల్ని ఓ యువకుడు తన వ్యాపారంగా మార్చుకున్నాడు. ఏకంగా రిలేషన్‌షిప్ ఇన్సురెన్స్ పాలసీని తెరపైకి తెచ్చాడు. ప్రేమ జంటలు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకుంటే లక్షలు సంపాదించే అవకాశం కల్పిస్తున్నాడు. ఇంతకీ సంగతేంటంటే.. ఓ యువకుడు జికి లవ్ పేరిట ఓ రిలేషన్‌షిప్ ఇన్సురెన్స్ పాలసీని తీసుకొచ్చాడు. ఈ ఇన్సురెన్స్ ప్రేమికులకు మాత్రమే వర్తిస్తుంది. ఇన్సురెన్స్ తీసుకున్న లవర్స్ ఐదు సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఇద్దరూ పెళ్లి చేసుకుంటే.. ఐదేళ్ల పాటు కట్టిన దానికి 10 రెట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి.
ప్రపంచంలో ఇదే మొదటి రిలేషన్‌షిప్ ఇన్సురెన్స్ పాలసీ కావటం విశేషం. బ్రేకప్స్, సిట్యువేషన్‌షిప్స్ ఎక్కువైన ఈ కాలంలో ప్రేమికుల్లో మార్పులు తీసుకురావటానికి ఆ యువకుడు ఈ ప్రయోగానికి తెరతీశాడు. అయితే, ప్రేమికులు పెళ్లి వరకు కలిసి ఉంటేనే డబ్బులు వస్తాయి. వాళ్లు మధ్యలో విడిపోతే..కట్టిన ప్రీమియంలో ఒక్క రూపాయి కూడా వెనక్కు రాదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, రిలేషన్‌షిప్ ఇన్సురెన్స్ పాలసీపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ పాలసీని సమర్థిస్తుంటే.. మరికొంత మంది తిడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి సూసైడ్ లెటర్
Viral Mosquitoes News: యువతి పిచ్చి మామూలుగా లేదు.. దోమల్ని చంపి, వాటితో..