Share News

Archery World Cup 2025: ధీరజ్‌ టీమ్‌కు రజతం

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:52 AM

ధీరజ్‌ బొమ్మదేవర నాయకత్వంలోని భారత రికర్వ్‌ ఆర్చరీ జట్టు వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1 ఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. భారత జట్టు ఫైనల్‌లో 1-5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది

Archery World Cup 2025: ధీరజ్‌ టీమ్‌కు రజతం

  • ఫైనల్లో చైనా చేతిలో ఓటమి

న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1లో ధీరజ్‌ బొమ్మదేవర నేతృత్వంలోని భారత పురుషుల రికర్వ్‌ జట్టు రజతంతో సరిపెట్టుకొంది. అమెరికాలోని సెంట్రల్‌ ఫోర్లిడాలో ఆదివారం జరిగిన ఫైనల్లో ధీరజ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌, అతాను దాస్‌లతో కూడిన భారత్‌ 1-5 పాయింట్ల తేడాతో చైనా టీమ్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి సెట్‌ 54-54 పాయింట్లతో సమమైంది. అయితే, రెండో సెట్‌ను 58-55తో చైనా నెగ్గడంతో.. మ్యాచ్‌లో నిలవాలంటే మూడో సెట్‌లో భారత్‌ తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్థితి. కానీ, భారత్‌ 54-55తో ఓడడంతో చైనాకు స్వర్ణం ఖాయమైంది. కాంస్య పతకాన్ని కూడా చైనానే సొంతం చేసుకొంది.

Updated Date - Apr 14 , 2025 | 03:54 AM