IPL 2025 Player Replacement: రుతురాజ్ స్థానంలో మాత్రే
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:28 AM
గాయపడిన రుతురాజ్ స్థానంలో చెన్నై జట్టు ఆయుష్ మాత్రేను తీసుకుంది. సన్‌రైజర్స్ జంపా బదులుగా స్మరణ్ రవిచంద్రన్‌ను జట్టులోకి తీసుకుంది

జంపా బదులు స్మరణ్
న్యూఢిల్లీ: గాయపడిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఆయుష్ మాత్రేను జట్టులోకి తీసుకొన్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని స్మరణ్ రవిచంద్రన్‌తో భర్తీ చేశారు. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న మాత్రేతో రూ. 30 లక్షలకు చెన్నై ఒప్పందం చేసుకొంది. 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయుష్ 962 పరుగులు చేశాడు. కర్ణాటకకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ స్మరణ్‌ను సన్‌రైజర్స్ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.