‘చాంపియన్స్’కు ముందు భలే చాన్స్!
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:52 AM
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి సన్నాహకంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీ్‌సలో.. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మరోసారి అందరి దృష్టీ నిలవనుంది. కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్‌నె్‌సతోపాటు కొన్ని స్థానాలను తగిన ఆటగాళ్లను...

మధ్యాహ్నం 1.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్‌లో
నేడు ఇంగ్లండ్‌తో తొలి వన్డే
జట్టు కూర్పుపై రానున్న స్పష్టత
కోహ్లీ, రోహిత్‌పైనే కళ్లన్నీ
కీపర్ రేసులో రాహుల్, పంత్
బలంగా కనిపిస్తున్న భారత్
నాగ్‌పూర్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి సన్నాహకంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీ్‌సలో.. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మరోసారి అందరి దృష్టీ నిలవనుంది. కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్‌నె్‌సతోపాటు కొన్ని స్థానాలను తగిన ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఈ సిరీ్‌సను సెలెక్టర్లు ఉపయోగించుకోనున్నారు. టీ20 సిరీస్ విజయంతో జోష్ మీదున్న భారత్ గురువారం జరిగే తొలి వన్డేలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. 14 నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత స్వదేశంలో తొలిసారి భారత్ యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలోకి దిగుతోంది. ఇటీవల టెస్టుల్లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ ఈ సిరీ్‌సలో మునుపటి ఆటతో చెలరేగాలని అభిమానులు కోరుకొంటున్నారు. 2023 విశ్వకప్‌లో కోహ్లీ 765, రోహిత్ 597 పరుగులతో అదరగొట్టారు. దీంతో టీమిండియా అజేయంగా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీ్‌సలో టీమిండియా 0-2తో పరాజయం పాలైంది. రోహిత్ రెండు అర్ధ శతకాలు సాధించినా.. కోహ్లీ ఆకట్టుకోలేక పోయాడు. అదే పేలవ ఫామ్‌ను గత మూడు నెలలుగా వీరు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి భారత ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం. వికెట్ కీపర్ విషయంలో కూడా మేనేజ్‌మెంట్ డోలాయమానంలో పడింది.
కేఎల్ రాహుల్ లేదా రిషభ్ పంత్‌లో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో తెలియదు. రోహిత్‌తో కలసి శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయనుండగా.. కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తర్వాత వికెట్ కీపర్-బ్యాటర్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో కీపర్‌గా వ్యవహరించిన రాహుల్ మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణించాడు. కానీ, ఎడమ చేతి వాటం ఆటగాడైన పంత్ జట్టులో ఉంటే వైవిధ్యంతోపాటు అతడి దూకుడైన ఆట జట్టుకు అదనపు బలంగా మారొచ్చు. ఒకవేళ ఇద్దరినీ ఆడించాలనుకొంటే మాత్రం అయ్యర్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. వరల్డ్‌కప్ తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి వన్డేలు ఆడుతున్నాడు. గాయాల నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ ఫిట్‌నె్‌సను ఈ సిరీ్‌సతో నిశితంగా పరీక్షించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీ్‌సలో షమి బరిలోకి దిగగా.. కుల్దీప్ సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చాడు. బుమ్రా, సిరాజ్ లేకపోవడంతో షమి, అర్ష్‌దీ్‌పపైనే బౌలింగ్ భారం ఎక్కువగా పడనుంది. జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లో ఇద్దరే ఆడే చాన్సులున్నాయి. వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసినా.. అతడిని ఆడించే అవకాశాలు తక్కువ.
జట్లు
భారత్ (అంచనా): రోహిత్, శుభ్‌మన్ గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్/పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్/సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్ సింగ్, షమి.
ఇంగ్లండ్ (తుది జట్టు): డకెట్, ఫిల్ సాల్ట్, రూట్, హ్యారీ బ్రూక్, జోష్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), లివింగ్‌స్టోన్, బెథల్, బ్రెండన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, రషీద్, షకీబ్ మహమూద్.
94
14 వేల పరుగుల మార్క్ చేరుకోవడానికి కోహ్లీకి కావాల్సిన పరుగులు. వన్డేల్లో సచిన్ (18,426 పరుగులు), సంగక్కర (14,234 పరుగులు) కోహ్లీ కంటే ముందున్నారు.
5
200 వికెట్ల మైలురాయిని
చేరుకోవడానికి షమికి కావాల్సిన వికెట్లు.
పిచ్/వాతావరణం
వికెట్ స్పిన్నర్లు సహకరించే అవకాశం ఉంది. కానీ, బ్యాటింగ్‌కు కూడా అనుకూలమే. ఇక్కడి తొలి ఇన్నింగ్స్ సగటు 288 పరుగులు. అయితే, ఆరేళ్ల తర్వాత ఇక్కడే వన్డే మ్యాచ్ జరుగుతోంది. వాతావరణం సాధారణంగా పొడిగా ఉండనుంది.
రూట్ రాకతో..
టీ20 సిరీ్‌సలో ఓడిన ఇంగ్లండ్ వన్డేలతో బలంగా పుంజుకోవాలనుకొంటోంది. 14 నెలల విరామం తర్వాత జో రూట్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ బలం పెరిగింది. ఈ ఒక్క మార్పు మినహా టీ20లు ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించనుంది. బట్లర్, లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్ రాణిస్తే ఈ జట్టు భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. పేసర్ షకీబ్ మహమూద్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.
ఇదీ చదవండి:
పోయిన చోటే వెతుక్కుంటున్న వరుణ్.. విధినే ఎదిరించిన యోధుడు
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
సిక్సులతో విరుచుకుపడ్డ రోహిత్-కోహ్లీ.. క్రెడిట్ అంతా అభిషేక్‌కే
మరిన్ని క్రీడలు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి