Abhishek Sharma: బ్యాటింగే చేస్తానంటే సరిపోదు.. అభిషేక్‌కు హర్భజన్ వార్నింగ్
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:34 AM
Harbhajan Singh: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఓవర్‌నైట్ హీరో అయిపోయాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లతో ఫేమ్ సంపాదించుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌పై సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ తన ముద్ర వేశాడు. అతడి నాక్‌పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.

ప్రతి బ్యాటర్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ నాక్స్ కొన్ని ఉంటాయి. కెరీర్ ముగిశాక వెనక్కి తిరిగి చూసుకుంటే అవే గుర్తుకొస్తాయి. అయితే అలాంటి ఇన్నింగ్స్‌లు అంత ఈజీగా రావు. కొన్నేళ్ల పాటు ఆడుతూ పోతేనే ఇది సాధ్యం. అయితే కొందరు చిచ్చరపిడుగులు మాత్రం కెరీర్ స్టార్టింగ్‌లోనే మెమరబుల్ నాక్స్ ఆడి ఆశ్చర్యపరుస్తుంటారు. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదే పని చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 54 బంతుల్లో 135 పరుగుల ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. 7 ఫోర్లు, 13 సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. అలాంటోడిపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సీరియస్ అయ్యాడు.
చెప్పినా వినలేదు!
ఇంగ్లండ్‌తో టీ20లో బ్యాటింగ్‌లో సెంచరీతో వీరవిహారం చేసిన అభిషేక్ శర్మ.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 1 ఓవర్ వేసి 3 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే ఈ లెగ్ స్పిన్నర్ బ్రేక్‌త్రూలు అందిస్తూ తనలోని స్పిన్ నైపుణ్యాన్ని బయట పెడుతూ వస్తున్నాడు. అయితే ఇదే అంశంపై హర్భజన్ సీరియస్ అయ్యాడు. అభిషేక్ బ్యాటింగ్ మీదే దృష్టి పెడుతున్నాడని.. మరి బౌలింగ్ ఎవరు చేస్తారని ప్రశ్నించాడు భజ్జీ. అతడిలో మంచి లెగ్ స్పిన్నర్ దాగి ఉన్నాడని.. బౌలింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకో అంటూ అభిషేక్‌కు అతడు వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయంలో గతంలోనూ పలుమార్లు సూచనలు చేసినా అతడు పట్టించుకోలేదని సీరియస్ అయ్యాడు భజ్జీ.
ఇది సరిపోదు!
‘అభిషేక్‌ను కలసిన ప్రతిసారి బౌలింగ్ గురించే మాట్లాడతా. బౌలింగ్ గురించి డిస్కస్ చేద్దామని చెబుతా. ఎందుకంటే అతడిలో మంచి స్పిన్నర్ దాగి ఉన్నాడు. బ్యాటింగ్ అంటే అభిషేక్‌కు ఎంతో ఇష్టం. బ్యాటర్ కాబట్టి అందుకు సంబంధించిన సాధన ఎలాగూ చేస్తాడు. ఆ విషయంలో అతడు మరింత ఎదుగుతాడు. కానీ బౌలర్‌గా మాత్రం ఇది సరిపోదు. అతడు చాలా ప్రాక్టీస్ చేయాలి. అతడిలో ఇంకా పరిపక్వత రావాల్సి ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగే క్వాలిటీస్ అతడిలో ఉన్నాయి. అభిషేక్‌లో కష్టపడేతత్వం ఎక్కువ. అతడు దేనికీ భయపడడు. ఒకవేళ అభిషేక్‌కు నేనేమైనా సాయం చేయగలనని భావిస్తే దానికి తప్పకుండా సిద్ధమే’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి:
ఈగో తగ్గించుకోకపోతే కెరీర్ ఫినిష్.. సంజూపై వరల్డ్ కప్ హీరో సీరియస్
కోహ్లీ కొంపముంచిన బస్ డ్రైవర్.. ఎంత పని చేశావ్ భయ్యా
ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు బిగ్ షాక్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి