Azmatullah Omarzai: ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్.. ఇదేం ఉతుకుడు సామి
ABN, Publish Date - Feb 28 , 2025 | 06:55 PM
AFG vs AUS: ప్రత్యర్థులను బెదిరించే ఆస్ట్రేలియాను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. బంతి వేయాలంటేనే వణికిపోయేలా చేశాడు. భీకర షాట్లతో తుఫానులా వాళ్లపై విరుచుకుపడ్డాడు. మరి.. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

అవతల ఉన్నది ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టు. కమిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్ లాంటి డేంజరస్ బౌలర్లు లేకపోయినా ప్లేయింగ్ 11 పరంగా బలంగా ఉంది కంగారూ టీమ్. లీథల్ పేస్‌తో భయపెట్టే స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షాస్, నాథన్ ఎల్లిస్ లాంటి పేసర్లు, ఆడమ్ జంపా లాంటి క్వాలిటీ స్పిన్నర్ ఉన్నారు. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్. ఈ తరుణంలో ఓ 24 ఏళ్ల ఆఫ్ఘానిస్థాన్ బ్యాటర్ చెలరేగిపోయాడు. సిక్సులతో స్టేడియంలో తుఫాన్ సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడే అజ్మతుల్లా ఒమర్జాయి.
సిక్సుల మీద సిక్సులు
ఆసీస్‌తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయి చెలరేగిపోయాడు. భారీ సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. 63 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బాల్‌కు ఒక రన్ చేసినట్లు కనిపించినా.. అతడు సింగిల్స్, డబుల్స్ కంటే ఎక్కువగా బిగ్ షాట్స్‌తోనే డీల్ చేశాడు. 1 బౌండరీ మాత్రమే బాదిన ఒమర్జాయి.. ఏకంగా 5 సిక్సులు కొట్టాడు. రషీద్ ఖాన్ (19)తో కలసి ఎనిమిదో వికెట్‌కు 36 పరుగులు, నూర్ అహ్మద్ (6)తో కలసి తొమ్మిదో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. మొదట్లో సెదీఖుల్లా అటల్ (85) వీరోచిత పోరాటం చేయగా.. ఆఖర్లో ఒమర్జాయి పిచ్చకొట్టుడు కొట్టడంతో ఆఫ్ఘాన్ 273 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను కంగారూల ముందు ఉంచగలిగింది.
ఇవీ చదవండి:
ఆసీస్‌ను భయపెట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్
ఒకడేమో దారుణశస్త్రం.. ఒకడేమో మారణశాస్త్రం..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 28 , 2025 | 06:55 PM