IPL 2025 Captains: ఐపీఎల్ కెప్టెన్స్‌కు బీసీసీఐ షాక్.. ఏకంగా ఆరుగురికి పెనాల్టీ
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:37 PM
IPL Captains: క్యాష్ రిచ్ లీగ్‌లోని కెప్టెన్లకు గట్టి షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఏకంగా ఆరుగురు సారథులపై కొరడా ఝళిపించింది. బోర్డు ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్-2025 మొదలై చూస్తుండగానే మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ వీక్‌లో ఒకదాన్ని మించి మరో మ్యాచ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది. చాలా వరకు మ్యాచులు లాస్ట్ ఓవర్స్ దాకా వెళ్తుండటంతో ఆడియెన్స్‌లో ఎగ్జయిట్‌మెంట్ మరింత పెరిగింది. అయితే అంతా బాగానే ఉన్నా క్యాష్ రిచ్ లీగ్‌లోని టీమ్స్ కెప్టెన్స్‌తో భారత క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వరుసగా ఒకరి తర్వాత ఒకరి మీద కొరడా ఝళిపిస్తోంది బీసీసీఐ. మరి.. బోర్డు ఎందుకిలా చేస్తోంది.. కెప్టెన్స్ చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ లిస్ట్‌లోకి అక్షర్..
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్‌కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓవర్లు నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయకపోవడంతో అతడికి రూ. 12 లక్షలు ఫైన్ వేసింది బోర్డు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కింద సారథులు జరిమానా ఎదుర్కోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే సంజూ శాంసన్-రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), రజత్ పాటిదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) ఈ లిస్ట్‌లో ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌తో అక్షర్ కూడా ఈ జాబితాలో చేరాడు.
ఎందుకిలా..
సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్‌లో కొన్ని మ్యాచుల్లో ఇలా స్లో ఓవర్ రేట్స్ నమోదవుతుంటాయి. దీని కింద ఆయా జట్ల కెప్టెన్స్‌కు జరిమానా విధిస్తుంటారు. అయితే ఈసారి లీగ్ ఇంకా సగం కూడా పూర్తవక ముందే ఏకంగా ఆరుగురు సారథులకు ఫైన్ వేయడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కాగా, నిన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తక్కువ మార్జిన్‌తో ఓటమిపాలైంది. అసలే టీమ్ పరాభవం పాలవడంతో నిరాశలో ఉన్న అక్షర్ పటేల్‌కు స్లో ఓవర్ రేట్ కింద ఫైన్ వేయడం మింగుడు పడని విషయమేనని చెప్పాలి.
ఇవీ చదవండి:
ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్లకు తప్పిన ప్రమాదం
నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు: నాయర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి