Share News

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:49 PM

Viral Run Out Video: క్రికెట్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఫన్నీ క్యాచ్‌లు, రనౌట్లకు సంబంధించిన వీడియోలకు వ్యూస్ ఓ రేంజ్‌లో వస్తాయి.

ENG U19 vs SA U19: ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
Viral Run Out Video

క్రికెట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. ముఖ్యంగా ఆటలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌పై అందరిలోనూ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే క్యాచ్‌లు డ్రాప్ చేసిన వీడియోలు, ఫన్నీ ఔట్లు లాంటివి వైరల్ అవుతుంటాయి. ఇలాంటివి పాకిస్థాన్ ఆటగాళ్లు ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి వాళ్లు ఆడే వీడియోలు బాగా హల్‌చల్ చేస్తుంటాయి. అయితే ఈసారి ఇంగ్లండ్-సౌతాఫ్రికా టీమ్స్ వంతు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. అది చూస్తే నవ్వాగదు.


తప్పు లేకున్నా..

ఇంగ్లండ్ అండర్ 19- సౌతాఫ్రికా అండర్ 19 జట్లకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాటర్ వినూత్న రీతిలో ఔట్ అయ్యాడు. ఆర్యన్ సావంత్ అనే బ్యాటర్ కొట్టిన బంతి స్క్వేర్ లెగ్‌లో కాచుకొని ఉన్న ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. అయితే షాట్ బలంగా కొట్టడంతో బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఆ వేగానికి రివర్స్ వచ్చిన బాల్ కాస్తా నేరుగా వెళ్లి స్టంప్స్‌ను పడగొట్టింది. షాట్ కొట్టిన బ్యాటర్.. బంతి ఫీల్డర్‌కు తాకడంతో కాస్త ముందుకు వచ్చి ఏమైందో అని ఆశ్చర్యంగా చూస్తుండగా.. అదే టైమ్‌లో వెనక్కి వచ్చిన బాల్ వికెట్లను పడేసింది. దీంతో అంపైర్ అతడ్ని రనౌట్‌గా ప్రకటించాడు.


పాపం.. బ్యాడ్ లక్!

బౌలర్‌తో పాటు స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ అప్పీల్ చేయడంతో అంపైర్ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఒకవైపు బ్యాటర్ ఔట్ అయ్యాడనే సంతోషంలో సెలబ్రేట్ చేసుకుంటూనే మరోవైపు బంతి తగిలి కిందపడిన ఫీల్డర్‌ దగ్గరకు చేరుకున్నారు ఆటగాళ్లు. అతడ్ని సముదాయించారు. అయితే తన తప్పు లేకుండా రనౌట్ అవడంతో బ్యాటర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. అసలు ఎలా ఔట్ అయ్యానా? అంటూ అతడు బిత్తరపోయాడు. ఆ తర్వాత షాక్ నుంచి కోలుకొని పెవిలియన్ దిశగా నిరాశగా నడుస్తూ పోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. ఈ బ్యాటర్‌ కంటే దురదృష్టవంతుడు ఎవరూ ఉండరని అంటున్నారు. దురదృష్టం ఉంటే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత బహుశా ఇలాంటి వాటిని చూసే వచ్చి ఉంటుందని జోకులు పేల్చుతున్నారు.


ఇదీ చదవండి:

కోహ్లీ పైకి దూసుకొచ్చిన అభిమాని.. గల్లా పట్టి..

జనమా.. బంతిపూల వనమా.. కోహ్లీ క్రేజ్‌

అర్జున్‌ పాయింట్‌ పంచుకున్నాడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 03:05 PM