ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: అడ్డంగా బుక్కైన పాకిస్థాన్.. ఉన్న కాస్త పరువూ పోయింది

ABN, Publish Date - Jan 08 , 2025 | 02:38 PM

పాకిస్థాన్ ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముందు దాయాది దేశం అడ్డంగా బుక్కైంది. ఇక పాక్‌ను కాపాడటం ఎవరి వల్లా కాదనే చెప్పాలి.

Champions Trophy 2025

50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే చాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. వచ్చే నెలలో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచులను మినహాయించి మొత్తం టోర్నీకి పాక్‌ హోస్ట్‌గా ఉంది. మెగా టోర్నీకి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లను పరిశీలించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే స్టేడియాలను సిద్ధం చేయడంలో పాక్‌ విఫలమైంది. చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులకు వేదికలుగా ఉన్న స్టేడియాల్లో నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో పాక్‌ బోర్డుపై ఐసీసీ సీరియస్ అయిందని సమాచారం.


ఎక్కడి పనులు అక్కడే..

చాంపియన్స్ ట్రోఫీ కోసం కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియంతో పాటు రావల్పిండి స్టేడియాన్ని ఎంపిక చేశారు. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన పాక్ బోర్డు.. ఐసీసీ నుంచి వచ్చిన ఫండ్స్‌తో ఈ మూడు స్టేడియాల పునర్మిర్మాణానికి పూనుకుంది. కానీ ఇన్ని నెలలు కావొస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉండటం, మెగా టోర్నీకి మరో నెల రోజుల సమయమే మిగిలి ఉండటంతో వర్క్ అప్‌డేట్ తెలుసుకున్నారట ఐసీసీ పెద్దలు. అయితే పనులు పెండింగ్ ఉన్నాయని తెలిసి షాక్ అయ్యారట. డిసెంబర్ 31 నాటికే పనులు పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంకా పెండింగ్ వర్క్ చాలా ఉందని సమాచారం.


ఐసీసీ అల్టిమేటం!

‘మూడు స్టేడియాల్లోని పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇంకా చాలా వర్క్ జరగాల్సి ఉంది. రెనోవేషన్‌కు సంబంధించిన మేజర్ వర్క్ ఇంకా కొనసాగుతోంది. సీట్లు, ఫ్లడ్‌లైట్స్, ఇతర ఫెసిలిటీస్‌కు సంబంధించిన పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఔట్‌ఫీల్డ్ వర్క్ కూడా పూర్తవ్వలేదు’ అని ఐసీసీ పెద్దలు అన్నారని సమాచారం. భారత్ తమ దేశానికి రావాల్సిందేనంటూ బిల్డప్ ఇచ్చిన పాక్.. టోర్నీకి స్టేడియాలను సిద్ధం కూడా చేయలేకపోవడంతో పరువు పోగొట్టుకుంది. దీంతో పీసీబీకి ఐసీసీ అల్టిమేటం ఇచ్చిందట. మరో రెండు వారాల్లో పనులు పూర్తవకపోతే చాంపియన్స్ ట్రోఫీని దుబాయ్‌కు తరలిస్తామని హెచ్చరించిందట. అదే జరిగితే పాక్‌కు దాని కంటే పెద్ద అవమానం లేదనే చెప్పాలి.


ఇవీ చదవండి:

లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న టీమిండియా స్టార్.. అప్పటిదాకా నో క్రికెట్

ఆ స్టార్లను సౌతాఫ్రికా పంపండి.. బీసీసీఐకి డివిలియర్స్ రిక్వెస్ట్..

రోహిత్‌-కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. లాస్ట్ చాన్స్ అంటూ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 08 , 2025 | 02:50 PM