IND vs BAN: అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్.. సెలబ్రేషన్ అదిరింది

ABN, Publish Date - Feb 20 , 2025 | 05:48 PM

Champions Trophy 2025: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను దించేశాడో బంగ్లాదేశ్ బ్యాటర్. అచ్చం బన్నీలాగే తగ్గేదేలే అంటూ స్టైల్, స్వాగ్‌తో సెలబ్రేట్ చేసుకున్నాడు.

IND vs BAN: అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్.. సెలబ్రేషన్ అదిరింది
IND vs BAN

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మేనియా ఇప్పుడు ఇతర దేశాలకూ పాకింది. ‘పుష్ప’ సినిమాతో మొత్తం ఇండియాను షేక్ చేశారు బన్నీ. ‘పుష్ప 2’తో ఆయన క్రేజ్ ఖండాంతరాలకు విస్తరించింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ మొత్తం సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలోనూ బన్నీ మేనియా కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తగ్గేదేలే సెలబ్రేషన్ వైరల్ అయింది. హాఫ్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు.


తగ్గేదేలే!

బ్యాట్‌ను హెల్మెట్ కింద నుంచి తీసుకెళ్తూ తగ్గేదేలే పోజ్‌ను దించేశాడు జేకర్ అలీ. ఈ మ్యాచ్‌లో ఒక సమయంలో బంగ్లాదేశ్ 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన జేకర్ పాతుకుపోయాడు. సహజశైలికి విరుద్ధంగా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. తౌహిద్ హృదోయ్ (85 నాటౌట్)తో కలసి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. సింగిల్స్, డబుల్స్ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. అయితే ఎక్కువగా సింగిల్స్‌తో బండి నడిపించారు. కష్టకాలంలో వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడిన జేకర్ బన్నీ ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. కాగా, బంగ్లా ప్రస్తుతం 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులతో ఉంది. ఆ టీమ్ 230 నుంచి 240 వరకు టార్గెట్ సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవీ చదవండి:

సారీ చెప్పిన రోహిత్.. చేతులు జోడించి..

గెలవాలంటే అదొక్కటే మార్గం అంటున్న అక్తర్

ప్లేయింగ్ 11లో వాళ్లకు చాన్స్ ఇవ్వని రోహిత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 05:51 PM