IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..
ABN, Publish Date - Jan 22 , 2025 | 04:49 PM
India verus England Live Streaming: కొత్త సంవత్సరంలో టీమిండియా రసవత్తర పోరుకు సిద్ధమవుతోంది. పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడేందుకు మెన్ ఇన్ బ్లూ రెడీ అవుతోంది.

నిన్న మొన్నటి వరకు టెస్టుల మీద టెస్టులు ఆడుతూ ఫుల్ బిజీగా ఉండేది టీమిండియా. వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో లాంగ్ ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడి అలసిపోయారు ఆటగాళ్లు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిశాక స్వదేశానికి చేరుకున్న ప్లేయర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం జోరుగా సాధన చేశారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ జరిగే తొలి టీ20తో సిరీస్‌కు తెరలేవనుంది. 5 టీ20ల ఈ సిరీస్‌ను గెలుచుకోవాలని అటు బట్లర్ సేన, ఇటు సూర్య సేన పంతంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పొట్టి సిరీస్ మ్యాచులు ఎక్కడ చూడాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ ఓటీటీలోనే..!
భారత్-ఇంగ్లండ్ ఫస్ట్ టీ20 మ్యాచ్ జనవరి 22, బుధవారం సాయంత్రం 7 గంటలకు మొదలవనుంది. 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ తమిళ్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ కన్నడ చానళ్లలో ఈ సిరీస్ మ్యాచుల్ని చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయొచ్చు. కాగా, ఈ సిరీస్‌లోని రెండో టీ20 జనవరి 24న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మూడో మ్యాచ్ జనవరి 27న చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), నాలుగో టీ20 జనవరి 29వ తేదీన సర్దార్ పటేల్ స్టేడియం (అహ్మదాబాద్)లో జరుగుతాయి. ఈ సిరీస్‌లోని ఆఖరి మ్యాచ్‌కు ఉప్పల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 1న ఆ మ్యాచ్ జరగనుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 22 , 2025 | 04:53 PM