IND W vs SA W: తెలుగు బిడ్డ సంచలనం.. వరల్డ్ కప్ విన్నర్‌గా భారత్
ABN , Publish Date - Feb 02 , 2025 | 02:42 PM
U19 Women's T20 World Cup: అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. మహిళల అండర్ 19 విమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపారు. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించారు.

క్రికెట్‌లో భారత్ సూపర్‌పవర్ అని మరోమారు రుజువైంది. తిరుగులేని శక్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రచ్చ చేస్తోంది టీమిండియా. తాజా విజయంతో మన బలం మరింత పెరిగింది. భారత అమ్మాయిలు అద్భుతం చేసి చూపించారు. అండర్ 19 టీ20 ప్రపంచ కప్ విజేతగా భారత్ ఆవిర్భవించింది. ఫైనల్ ఫైట్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది. తెలుగు బిడ్డ గొంగడి త్రిష బ్యాటింగ్‌లో 44 పరుగులు అద్వితీయ ఇన్నింగ్స్ ఆడటమే గాక బౌలింగ్‌లో 15 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి సంచలన ప్రదర్శన చేసింది. భారత్ చాంపియన్‌గా నిలవడంలో త్రిష కీలక పాత్ర పోషించింది. దీంతో అంతా ఆమెను మెచ్చుకుంటున్నారు. సూపర్బ్‌గా ఆడావని ప్రశంసిస్తున్నారు. ఇదీ టీమిండియా రేంజ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే..
భారత ప్లేయింగ్ 11లో సంచలన మార్పు.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు
ఆ సీక్రెట్ చెప్పను.. నా భార్య చూస్తోంది: రోహిత్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి