MI vs RCB Prediction: ముంబై వర్సెస్ ఆర్సీబీ.. హిట్‌మ్యాన్ నిలుస్తాడా.. చేజ్‌మాస్టర్ గెలుస్తాడా..

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:06 PM

IPL 2025: క్యాష్ రిచ్ లీగ్‌లో అసలు సిసలు పోరాటానికి రంగం సిద్ధమవుతోంది. టాప్ స్టార్స్ అంతా కలసి ఒకే మ్యాచ్‌లో ఎలా ఉంటుందో ఇవాళ ఆడియెన్స్ ఎక్స్‌పీరియెన్స్ చేయనున్నారు. ఈ పోరులో గెలుపోటములు రెండు జట్ల ఫ్యూచర్‌ను డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

MI vs RCB Prediction: ముంబై వర్సెస్ ఆర్సీబీ.. హిట్‌మ్యాన్ నిలుస్తాడా.. చేజ్‌మాస్టర్ గెలుస్తాడా..
MI vs RCB

ఐపీఎల్‌లో కొదమసింహాల కొట్లాటకు అంతా రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో టాప్ స్టార్స్ తమ ఆటతీరుతో ఆడియెన్స్‌కు ఫుల్ కిక్ ఇవ్వనున్నారు. ఆర్సీబీ-ఎంఐ మధ్య జరిగే ఈ పోరులో అటు కోహ్లీ, డుప్లెసిస్, పాటిదార్.. ఇటు రోహిత్, పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ వంటి స్టార్లు సందడి చేయనున్నారు. రెండు జట్లు ఓటమి తర్వాత ఆడుతున్న మ్యాచ్ కావడంతో గెలుపు కంపల్సరీగా మారింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు బలం ఎంత, ఎవరి బలహీనతలు ఏంటి.. రికార్డులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..


బలాలు

ముంబై: ఈ టీమ్ అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. బ్యాటింగ్‌లో విల్ జాక్స్ దగ్గర నుంచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరకు అంతా హిట్టర్లే. నమన్‌ ధీర్, సూర్యకుమార్, తిలక్ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెచ్చిపోతున్నాడు. గత మ్యాచ్‌లో అతడు 5 వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా రాకతో ఆ విభాగం సూపర్ స్ట్రాంగ్‌గా మారింది.

బెంగళూరు: ఈ జట్టుకు బ్యాటింగ్ మెయిన్ స్ట్రెంగ్త్. సాల్ట్, కోహ్లీ నుంచి టిమ్ డేవిడ్ వరకు సాలిడ్ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నారు. లివింగ్‌స్టన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ బిగ్ మ్యాచెస్‌లో ఎలా ఆడతాడో చెప్పనక్కర్లేదు. బౌలింగ్‌లో హేజల్‌వుడ్, యష్ దయాల్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంది ఆర్సీబీ.


బలహీనతలు

ముంబై: బ్యాటింగ్‌లో కొన్ని సమస్యలు ఎంఐని ఇబ్బంది పెడుతున్నాయి. విల్ జాక్స్ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. రికల్టన్‌లో నిలకడ కనిపించడం లేదు. రోహిత్ ఫామ్‌ను అందుకోలేక టీమ్‌కు భారంగా మారుతున్నాడు. హార్దిక్ పాండ్యా గత మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉన్నా మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోవడం అతడితో పాటు ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. బౌలింగ్‌లో శాంట్నర్ అంతగా ప్రభావం చూపడం లేదు.

బెంగళూరు: రజత్ పాటిదార్ త్వరగా ఔటైతే మిడిలార్డర్‌ షేక్ అవుతోంది. ఒకవేళ కోహ్లీ-పాటిదార్ త్వరగా ఔట్ అయితే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. అటు బౌలింగ్‌లో హేజల్‌వుడ్ బ్రేక్‌త్రూలు ఇవ్వకపోతే మిగతా బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. బౌలింగ్‌లో ఎక్కువ ఆప్షన్స్ లేకపోవడం మైనస్‌గా మారింది. ముఖ్యంగా కృనాల్‌కు తోడు మరో నిఖార్సయిన స్పిన్నర్ లేకపోవడం ఆర్సీబీని ఇబ్బంది పెడుతోంది.


హెడ్ టు హెడ్

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచులు జరిగాయి. వీటిల్లో ముంబై 19 మ్యాచుల్లో.. ఆర్సీబీ 14 మ్యాచుల్లో విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్

ఆర్సీబీ ఆడిన 3 మ్యాచుల్లో రెండింట నెగ్గింది. టీమ్ పరంగా బాగానే ఉంది. అటు ముంబై 4 మ్యాచుల్లో మూడింట ఓడింది. కానీ బుమ్రా రాకతో బౌలింగ్ యూనిట్ దుర్భేద్యంగా మారింది. పైగా హెడ్ టు హెడ్ రికార్డులు, హోం గ్రౌండ్ అడ్వాంటేజ్, బ్యాటర్ల ఫామ్ ముంబైకి అనుకూలంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇవాళ్టి పోరులో హార్దిక్ సేన గెలుపు ఖాయం.


ఇవీ చదవండి:

సన్‌రైజర్స్‌ను ఓడిస్తున్న కమిన్స్

రోహిత్ దిద్దుకోలేని తప్పు

పంత్‌పై ప్రేమ చంపుకోని హీరోయిన్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2025 | 03:12 PM