SRH vs GT: కాటేరమ్మ కొడుకులకు ఒక్కటే దారి.. రణమా.. శరణమా..

ABN, Publish Date - Apr 06 , 2025 | 06:13 PM

Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో పోరాటానికి సిద్ధమవుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో నేడు జరిగే ఫైట్‌లో గెలవడం కమిన్స్ సేనకు కంపల్సరీ. అయితే జట్టును ఓ సమస్య వేధిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

SRH vs GT: కాటేరమ్మ కొడుకులకు ఒక్కటే దారి.. రణమా.. శరణమా..
Sunrisers Hyderabad

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్ సీజన్ మొదలవడానికి ముందు ప్రత్యర్థులంతా భయపడిన జట్టు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ చూసి అపోజిషన్ టీమ్స్ వణికిపోయాయి. మొత్తం కాటేరమ్మ కొడుకులను తలచుకొని భయంతో వెనకడుగు వేశాయి. కానీ ఒక్కో మ్యాచ్ జరిగే కొద్దీ ఆ ఫియర్ పోతోంది. హ్యాట్రిక్ ఓటములతో రేసులో వెనుకబడింది కమిన్స్ సేన. కమ్‌బ్యాక్ కోసం అటు ప్లేయర్లతో పాటు ఇటు అభిమానులూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఇవాళ గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌ను వాడుకోవాలని భావిస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ ఫేట్ మారాలంటే ఒకే దారి ఉంది. అది రణమా.. శరణమా.. అనేది డిసైడ్ చేస్తుంది. ఆ రూట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


వాళ్ల చేతుల్లోనే..

బ్యాటింగ్ రాక్షసులతో నిండిన సన్‌రైజర్స్‌కు బౌలింగ్ పెద్ద హెడెక్‌గా మారింది. బ్యాటర్లలో ఇద్దరు, ముగ్గురైనా క్లిక్ అవుతున్నారు. కానీ బౌలింగ్ యూనిట్‌లో ఒక్కరూ రాణించడం లేదు. కెప్టెన్ కమిన్స్ దగ్గర నుంచి షమి, సిమర్జీత్, హర్షల్ పటేల్ వరకు అంతా దారుణంగా విఫలమవుతున్నారు. అవసరమైనప్పుడు బ్రేక్‌త్రూలు అందించలేకపోతున్నారు. ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. బౌలింగ్‌లో భారీగా రన్స్ లీక్ చేయడం వల్ల బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి బౌలర్లు మారాల్సిందే. ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి బంతిని, ప్రతి పరుగును కీలకంగా తీసుకోవాలనే సూచనలు వస్తున్నాయి. అపోజిషన్ బ్యాటర్లకు తగ్గట్లు స్కెచ్‌లు వేసుకొని పని పట్టాలని.. అప్పుడే టీమ్ విజయాల బాట పడుతుందని ఎక్స్‌పర్ట్స్ సజెషన్స్ ఇస్తున్నారు. బౌలింగ్ మెరుగుపడితే బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారని.. కాబట్టి శరణం వరకు పరిస్థితి రావొద్దంటే, బౌలర్లు భీకరంగా యుద్ధం చేయాల్సిందేనని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ఎస్‌ఆర్‌హెచ్‌ లెక్కలు తేల్చాల్సిందే

ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్ జీటీ.. లెక్కలు తేలుస్తారా

పేస్ పిచ్చోడు వచ్చేశాడు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 06 , 2025 | 06:13 PM